'క్లాప్' కొట్టు గురూ!

టార్గెట్ టాలీవుడ్డే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’, ‘బస్‌స్టాప్’, ‘కేరింత’ చిత్రాలతో మంచి అభినయం వున్న నటిగా అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య మంచి మార్కుల్నే కొట్టేసింది. ఆయా చిత్రాలో ఈ అమ్మడు చేసిన పాత్రలు టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి..ఆకట్టుకున్నాయి కూడా. అయితే టాలీవుడ్ మాత్రం ఈమె వైపు చిన్నచూపునే చూస్తోంది. కారణాలు తెలియకపోయినా, కనీసం తెలుగమ్మాయి అయినందుకైనా అవకాశాలు ఇవ్వాలిగా అని కొందరంటే ‘ప్చ్..చూద్దాంలే’ అంటూ దాటేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కోలీవుడ్ మాత్రం శ్రీదివ్యకు మంచి అవకాశాలే ఇస్తోంది. అక్కడ విశాల్ హీరోగా నటించిన ‘మరుదు’ తెలుగులో ‘రాయుడు’గా వచ్చింది. తమిళంలో కార్తితో ‘కాష్మోర’ చేసింది. జీవాతో మరో చిత్రం..ఇలా తమిళనాట ఆమె కెరీర్ ఊపందుకుంటూనే వుంది. అయినా ఆమె టార్గెట్ మాత్రం టాలీవుడ్డేనట! ఇకనైనా తెలుగులో మళ్లీ మంచి అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తోంది శ్రీదివ్య.

-సమీర్