'క్లాప్' కొట్టు గురూ!

పొగడ్తలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా ఎవరైనా తమ పని చేయించుకోవాలంటే ఎదుటివాళ్లని అద్భుతంగా పొగిడేస్తుంటారు. సినిమా పరిశ్రమలో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరిని ఎట్లా పొగిడితే ఎలాంటి లాభాలొస్తాయో లెక్కలువేసి మరీ పొగిడేస్తుంటారక్కడ! ఈ విషయంలో మాత్రం తాను ఖరాకండీ అంటోంది అనుష్క. ఎవరైనా తనను పొగుడుతున్నారు అంటే వెంటనే వెనకనుండి గొయ్యి తవ్వేస్తున్నారు అనే అర్థం గుర్తొస్తుంది. అందుకే అలాంటి వాళ్లకి దూరంగా ఉంటానంటోంది. ఎవరైనా మనల్ని పొగుడుతుంటే సంతోషంగానే వుంటుంది వినేటప్పుడు. కానీ అవన్నీ పూర్తయ్యాక వారితో కలిసి ఉన్న ఆ ఐదు నిమిషాలు కూడా ఎంతో ఇబ్బందిగా ఫీలవ్వాల్సి వస్తోంది. పొగిడిన తర్వాత వాళ్లు ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా వినాల్సొస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఇరుక్కోవడం చాలా దుర్భరం. అందుకే అట్లాంటి వాటికి తానెప్పుడూ దూరమంటోంది. అయితే ఇంత ఇబ్బందికి సంబంధించిన జ్ఞానోదయం అయ్యిందీ అంటే అనుష్కనే చాలామంది పొగిడేసుంటారని మనకూ అర్థమవుతోంది. పొగడ్తలు వినీ వినీ విసుగొచ్చినట్లుంది. అందుకే ఇలా బోల్డ్‌గా ఉన్నదున్నట్టుగా చెప్పేసింది!

అలా చూస్తూ..!
మనకేమీ తెలియనట్లు ఎదుటివాళ్లను చూసి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. తెలిసిందనుకోండి మనం చేసే పనిలో కొత్తదనం చూపించాలి. ఈ రెండు చేయలేనప్పుడు నటిగా వుండడమే వేస్ట్ అంటోంది అందాల నటి కేథరిన్. విషయంలోకెళితే ఇద్దరమ్మాయిలతో తెలుగు తెరకి పరిచయమైన కేథరిన్ ఆ తర్వాత సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఏదో అరా కొరా రెండు చిత్రాలు చిన్న చిన్న పాత్రలు వచ్చినా అవి కూడా సరైన హిట్స్ ఇవ్వలేకపోయాయి. దీంతో ఒక అడుగు వెనక్కువేసిన కేథరిన్ ఆ తర్వాత తనతోపాటు విజయాలు అందుకుంటున్న హీరోయిన్లను అలా చూస్తూ చూస్తూ వారు ఎలా చేస్తున్నారన్నదే నేర్చుకున్నానంటోంది. ఏం నేర్చుకున్నావు అంటే కనీసం అవకాశాలు లేకపోయినా ఏవైనా కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు వెళ్లి కొద్దోగొప్పో ధనలక్ష్మిని ఇంటికి తెచ్చుకుంటున్నానంటోంది. కొత్తగా ప్రారంభమయ్యే హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా తారల సందడితో నిండే కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు కొద్దోగొప్పో ఆదాయం వస్తోందంటూ ఆనందపడుతోంది. తనకన్నా సీనియర్లు అటువంటి కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఎటువంటి డ్రెస్‌లు వేస్తున్నారు, అక్కడ ఎలా వ్యవహరిస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అన్న విషయాలను పరిశీలించి, ఆ విధంగా ముందుకు వెళ్తున్నానంటోంది. ప్రస్తుతం ఆమె నటించిన సరైనోడు చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ఈ చిత్రంపై నమ్మకంతో ఎదురుచూస్తోంది కేథరిన్. ఈ సినిమా అయినా పెద్ద హీరో కనుక హిట్ అయితే తనకు అవకాశాలను తెచ్చిపెడుతుందేమోనని ఆశిస్తోంది. ఆశపడడం సహజమే కదా!

కథే ముఖ్యం
బాలీవుడ్ నటి సలోనిలుథేర్ తొలి చిత్రంతోనే అందర్నీ ఒక్కసారిగా హడలగొట్టేసింది. విషయంలోకెళితే తమిళ నటుడు నాజర్ కుమారుడు హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సింగపూర్‌లో జరుగుతోంది. దాదాపు ఒక షెడ్యూల్ పూర్తయ్యాక సలోనిలుథేర్ ఒక్కసారిగా అక్కడనుండి జంప్ అయిపోయింది. ఏంటమ్మా అని అడిగితే తనకు మొదట్లో చెప్పిన కథ ఒకటని, ఇప్పుడు సింగపూర్‌లో చిత్రీకరిస్తున్న కథ మరొకటని అలా కథలు మార్చి చిత్రీకరించడం తనకు నచ్చదని చెబుతోంది. ఏదైనా కథే ముఖ్యమని, అందులో తన పాత్ర హైలెట్‌గా ఉండకపోయినా కనీసం ప్రాధాన్యత ఉండేలా చూస్తానని, మొదట చెప్పిన కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉండడంతో కాల్షీట్లు ఇచ్చానని, ఇప్పుడు అలా జరగకపోవడంతో చిత్రంనుండి వైదొలగానని చెబుతోంది! తొలి సినిమా అందునా దక్షిణాదిలో ఒక్కటైనా విడుదల కాకుండా ఎన్ని షరతులు పెడుతోంది లుథేర్! అవకాశాలు రావాలంటే ఇలా ఉంటే కుదరదు సలోనీ!

-సమీర్