అక్షరాలోచన

సియాసత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరాటం చేసినపుడు
చేయి చేయి కలిపినోడు
సైనికులం మనమంతా
సమానులం అన్నోడు
విజయలక్ష్మి దక్కగానె
విఐపి అయినాడు.

పదవులేమి లేనప్పుడు
ప్రజలతోని ఉన్నోడు
అందరినీ కూడగట్టి
ముందుకు నడిపించినోడు
అధికారం దక్కగానె
అందని ద్రాక్షయినాడు

పండగలు పబ్బాలు
విందులు వినోదాలు
యజ్ఞాలు యాగాలు
కట్నాలు కానుకలు
ప్రజాధనం ఉదారంగ
‘పలారం’ చేస్తున్నడు

ప్రజాస్వామ్య హక్కులను
పదేపదే వల్లించి
ఉద్యమాలు నడిపినోడు
ప్రజాబలం పొందినోడు
విపక్షాల పేరెత్తితె
విరుచుకు పడుతున్నాడు

ఓటు రాజకీయాలకు
ప్రాధాన్యమిస్తున్నడు
గెలుపు గుర్రమెక్కడున్నా
వెతికివెతికి తెస్తున్నడు
ఎన్నికలను గెలవడమే
సియాసత్ అంటున్నడు.
*

-వేముల ప్రభాకర్ 9533120533