అక్షరాలోచన

‘క్యూ’ ...రియాసిటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యూ ఫర్ క్వశ్చన్‌మార్క్... అనుకోవచ్చా!
క్యూలు కేవలం సంబరాలు, సినిమా టిక్కెట్లు,
పండుగలు, పబ్బాలకే అన్న రోజులకు
కాలం చెల్లిందా?
నిరుపయోగమైన దినచర్యల నుంచి
చెల్లని కాలసులను ఏరుకోవచ్చా?
ఓ రద్దీ మార్కెట్
నిర్మానుష్యంగా రూపాంతరం చెందినపుడు
సగటు మనిషి చిరునామా
ఎక్కడని వెతకాలి?
తుది శ్వాసను కరవుతోనే కాదు
కరెన్సీతోనూ కొలవచ్చా?
గెనం, పాదులు, మడకలతో
మొలకెత్తే మట్టి వాసనల నడుమ
గీసుకునే కార్డులను కనిపెట్టగలమా?
స్తంభించిన రాకపోకల నడుమ
మీ ప్రయాణం ఎందాక
అంటే ఏం చెప్పాలి?
యాంత్రిక జీవనం తలక్రిందులైన చోట
స్వేచ్ఛా గీతాన్ని ఆలపిస్తున్నదెవరు?
హైటెక్ యుగంలో
ఏమిటీ రాచరికపు జాడలు??

- పొదలకూరు మధుకుమార్ 8686419208