అక్షరాలోచన

మార్పేమి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి
నోట్ల పడవలో వెళ్తున్నట్టు కల
ఏది కొనాలన్నా ఏడు సముద్రాలు దాటాలంటాడు
పడవ నడిపేవాడు
వేగాన్ని పెంచాలంటాను నేను,
పైగా మనం ఒడ్డుకు చేరేలోగా
ఏ వెలుగూ రాకూడదంటాను
నోటు మార్పిడి అంత సులువు
కాదంటాడు అతను
మీరేది కొనాలన్నా
ఈ నోట్లు చెల్లవు గాక చెల్లవంటాడు అతడు
అక్కడక్కడ అద్దాల మేడలు కూలుతున్న శబ్దం
వినిపిస్తుంది
తెలియని భయం
కల మధ్యలో ఆగిపోతే
ఇక వెనక్కి పోలేని కథ
ఇలానె జరుగుతుంది
పక్షం రోజుల రాత్రులనుండి
నోట్లతో కలల ప్రయాణం
అర్ధాంతరంగా ఆగుతూనే వుంది
ఇక ప్రయాణం సాగేలా లేదు
ఈ నోటు మార్పిడి జరిగేలా లేదు
పొద్దు వాలుతుంది
మళ్లీ అదే కల
నడిరేయలో ఈ నాటు పడవ
ఎక్కడ ఆగుతుందోననే
కలవరం
కాలం కదిలేలా లేదు
నోటు చెల్లేలా లేదు
ముగింపు ఎలా వుంటుందో
ఇప్పుడేం చెప్పేలా లేదు

- రవి ఆర్కె, 9849294127