మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
పాక్ తాలిబన్లను, చైనా మావోలను భారత్‌పై ఉసిగొల్పి భారత్ నాశనానికి ప్రయత్నిస్తుంటే మన రాజకీయ పార్టీలు కిమ్మనడం లేదు ఎందుకో?
వాటి దృష్టిలో అలాంటివి ‘‘హిందూ మతోన్మాదులు’’ మాత్రమే పట్టించుకోవల్సిన అంశాలు కాబట్టి.

మనది కుల, మత, వర్గ భేదాలు లేని లౌకిక రాజ్యం అంటారు కదా? మరి హిందువులకే బహు భార్యత్వం కూడదు అని శాసనాలు చేశారు. అన్ని మతాల వారికి సివిల్ కోడ్ నిబంధనలు సమానంగా వర్తించాలని రాజ్యాంగ సవరణ చేస్తే దేశం నిజంగా లౌకిక రాజ్యం అవుతుంది కదా?
మన సెక్యులర్ శీలం మంటకలుస్తుంది.

ఎ.వి. సోమయాజులు, కాకినాడ
వారసత్వ రాజకీయాలు అంటూ కాంగ్రెసును విమర్శించే బిజెపి, టిడిపిలు - సీనియర్ మంత్రులకు, కలెక్టర్లకు సూచనలిచ్చేంత కేబినెట్ ప్రాముఖ్యం లోకేష్‌కు ఇవ్వడాన్ని విమర్శించరేమిటి?
మన వీపు మనకు కనపడదు.

మెయన్ పేపర్ ఆంధ్రకు వేరు, తెలంగాణకు వేరుగా ఉంటుందా?
ఔను.

జొన్నలగడ్డ మార్కండేయులు, పేరవరం
ప్రచురణకి స్వీకరించిన, స్వీకరించని రచనల గురించి మీ నిర్ణయాన్ని రచయతలకు ఇ-మెయల్ ద్వారా తెలియపరచకూడదా?
దానికి కావలసిన వ్యవస్థను ముందు ఏర్పాటుచేసుకోవాలి. ప్రయత్నిస్తాం.

ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
రాజకీయ నాయకులు కూడా తాము బాహుబలులు కావాలనుకుంటున్నారు కదా... ఏ బాహుబలి? మొదటివాడా... రెండవవాడా?
ఏమో!

జగన్ ప్రధానిని కలిస్తే తప్పేమిటి? మీడియావారు, రాజకీయ వ్యతిరేకులు తెగ ఆడిపోసుకుంటున్నారు?
తమవాళ్ల పార్టీకి ఎక్కడ నష్టమొస్తుందోనన్న బెంగతో.

ఎస్. శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
ఇటీవల సిపిఎంవారు జనసేనతో పొత్తు పెట్టుకుని టిడిపి ప్రభుత్వాన్ని ఓడిస్తామని సిపిఎం నాయకులన్నారు. చంద్రశేఖరరావు గారన్నట్లు కమ్యూనిస్టు పార్టీలు నిజంగా తోక పార్టీలని తేటతెల్లమవలేదా?
ఔను.

సాంబశివరావు, వక్కలంక
పర్యావరణం పాడవుతున్నది అని అమరావతి ప్రాంతం గురించి నడుస్తున్న కేసుల పర్యవసానం ఎలా ఉండబోతున్నది?
నడుస్తూనే ఉంటాయ.

టి.ఎస్.ఎన్.మూర్తి, వైజాగ్
ఆడవారు మగవారికన్నా బలహీనులు, సమానంగా కష్టపడలేరు, బరువులు మోయలేరనే కదా ప్రభుత్వ ఉపాధి హామీ పథకం పనుల్లో ఆడ కూలీలకు మగవారికన్నా తక్కువ దినసరి వేతనం చెల్లిస్తున్నారు. ఇదే రూలు ఉద్యోగాల్లో మగవారికి సమాన స్థాయలో వున్న మహిళలకి తక్కువ గ్రేడు, స్కేలుకి ఫిక్స్ చెయ్యాలి కదా? ఇద్దరికీ ఒకే గ్రేడు, స్కేలు ఎలా ఇస్తున్నారు. కలెక్టర్లు, ఎంపీలు, మినిస్టర్ల స్థాయ వచ్చేసరికి ఈ తేడా మాయం అవుతుందా?
అవి బరువులు మోసే పనులు కావు.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఆ పార్టీనీ పొగుడుతూ కొన్నాళ్ల పిదప ఇంకో గొడుగు కిందకు చేరి వదిలిన పార్టీని తిట్ల పురాణంతో నిందిస్తూ చేరిక పార్టీకి జేజేలు కొడుతూ పబ్బం గడుపుకొనే విధానాన్ని ఏమనాలి?
రాజకీయ రంకు.

సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
కవితా రచయతగా నేను ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటూ ఉత్తరాయణం ద్వారా సమస్యలనే కవితారూపంగా పంపడం ప్రారంభించాను. నన్ను ప్రోత్సహించిన మీకు ధన్యవాదాలు. ‘అక్షరాలోచనలు’ శీర్షికకు కవితలు ఎలా పంపాలో తెలుపగలరు?
ఉత్తర కవిత్వాన్ని పంపినట్టే.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.