మాతో - మీరు

విదుషీమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశవాణితో అనుబంధం ఉన్న సంగీత గాయక శిఖామణులలో శ్రీరంగం గోపాలరత్నం గారు ఒక విదుషీమణి అని చెప్పవచ్చు. ఈమె కొన్ని సినిమా పాటలను మధురంగా ఆలపించినా, ఈ రంగంలో ఎక్కువగా ఆసక్తిని కనబరచలేదు. తన గాన రవళులతో జీవించినంత కాలం సామవేదానికి సేవ చేస్తూనే ఉన్నారు. ఏభై నాలుగేళ్ల మధ్య వయసులోనే దేహం చాలించడం ఆమె అభిమానుల దురదృష్టం. ఇళ్లల్లో రేడియోలున్న రోజులలో ఈమె గానాన్ని, స్వరాలను విని ఆనందించని వారుండరు. ఈమె వివాహం చేసుకున్నారా? సంతానం ఉన్నదా? ఈ సంగతులు కూడా రచయిత ఉదహరించి ఉంటే బావుండేది. ‘ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట’- ఈ పాట ఎంత వైభవంగా పాడారో, వినని వారుండరని మల్లాది వారన్న మాట నిజం. గత జ్ఞాపకాలను ప్రతీ వారం వర్షింప జేస్తున్నందుకు ఆనాటి ఆకాశవాణి శ్రోతలు రచయితకు రుణపడి ఉన్నారు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
వేదన
వైద్య శాస్త్రం, వైద్య విజ్ఞానం ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా అంతుపట్టని వ్యాధులు, రుగ్మతలు కారణంగా వేదన కలుగుతూనే ఉంద. ఎంతటి జటిల అనారోగ్యం ప్రాప్తించినా బొడ్డుతాడులోని మూల కణంతోనే అనారోగ్యాన్ని జయించవచ్చనే నూతన ఆవిష్కరణ అద్భుతమైనది. ఈ మూలకణం గురించి తెలీని ఎన్నో అద్భుతాలు కవర్‌స్టోరీలో విపులంగా వివరించినందుకు ధన్యవాదాలు. గోపాలం గారు వృత్తి పనుల వారి పనితనం గురించి చెప్తూ ఆ లయ, ఆ సమన్వయం నిజంగా ఆశ్చర్యకరం అన్నారు. ఆ మాట సత్యం. ఒక ఉక్కు కడ్డీని కమ్మరి గునపంగా మలిచే విధానం నేను కళ్ళారా చూసి దిగ్భ్రాంతి చెందాను. అయితే వృత్తి పనులన్నీ ఇప్పుడు నాశనం అయిపోతున్నాయి.
-కె.గునే్నశ్ (కొవ్వాడ)
మనసు బరువెక్కదు
ఇంటిలో పేరుకుపోయిన పాత వస్తువుల్ని పారెయ్యలేక, ఉంచుకోలేక బాధపడుతూంటారు. ఇవి ఎంత ఎక్కువైగా మనసు బరువెక్కదు అంటూ ‘సండే గీత’లో చక్కగా చెప్పారు. ఓ వృక్షంలా ఆకులు, అలములతో దుస్తులు తయారుచేసుకొని ధరించి గ్రీన్ మాన్ అవార్డు కోసం పోటీలో పాల్గొనడం తమాషాగా ఉంది. రాజకీయ సంతలో నీతికి నిలువ లేదన్న మీ సమాధానం బాగుంది. ‘ఎర్ర తివాచీ’ కవిత బాగుంది. ముఖ్యంగా చివరి పాదాలు ‘నిలదీయడం తెలియని అమాయకత్వాన్ని అమ్మ చేతి బువ్వలో తిన్నాం గనుక’ అనడం మరింత బాగుంది.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
స్వర్ణ కవచం
తూర్పు సీమకో స్వర్ణ కవచం లాంటి జలసేన గురించి కవర్‌స్టోరీలో మాకు తెలీని ఎన్నో విషయాలను విపులంగా విశదీకరించినందుకు ధన్యవాదాలు. ఈ వారం క్రైం కథ ‘మృత్యువుతో పందెం’ చిక్కని సస్పెన్స్‌తో బహు చక్కగా ముగిసింది. మృతుని ముఖంలోని చిరునవ్వు అసలు విషయాన్ని బయటపెట్టిన అసలు ట్విస్ట్. ఎవరూ ఊహించని ట్విస్ట్! శాకాహారమే బలవర్థకం అని అందరూ చెప్తారు. కాని వినేదెవరు? విందులో నాలుగు రకాల నాన్‌వెజ్ పెట్టడం హోదాకు, ఫ్యాషన్‌కు చిహ్నం అయింది. ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే మాంసాహార ఉపయోగం ఎక్కువైంది.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)
అమృతవర్షిణి
అన్నమయ్య సంగీత విషయంగా మల్లాది సూరిబాబు గారి విశే్లషణ, విమర్శ, వివరణలు చాలా సముచితంగా ఉన్నాయి. ఎలా పడితే అలా సంప్రదాయ, శాస్ర్తియ సంగీత బాణీలను మార్చి పాడటం, మంచిది కాదు. కానీ తోచక కొందరు, కాలక్షేపానికై మరి కొందరు, జీవనోపాధి నిమిత్తం, ఈ రోజు చాలా మంది సినీ, లలిత, అన్నమయ్య సంకీర్తనలనే ఆశ్రయిస్తున్నారు. సంగీత ద్రోహం జరగకుండా ఉంటే బాగుంటుంది. ఇదే మల్లాది వారి మాట. సంప్రదాయ సంగీత గురువులకన్నా సినీ సంగీత గురువులకే ప్రాధాన్యత, ధనార్జన సమకూరడంతో ఎంతోమంది ఆ వైపే మొగ్గు చూపుతున్నారు. మంచి శీర్షికను అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు.
-ఆర్.కె. (హైదరాబాద్)
చదరంగం
చదరంగం ఆటలోని సైనికునిలాగ లేదా రాజులాగ ఉండకూడదు. ఎందుకంటే వారిని వేరే వాళ్లు నడిపిస్తారు. మన జీవితాల్ని మనమే ప్రభావితం చేసుకోవాలన్న ‘ఓ చిన్న మాట’ మహా ఘనమైన మాట. న్యూహాంప్‌షైర్ మార్గం ఏరియల్ ఫొటో, సాల్ట్‌లేక్ ఫొటో అద్భుతంగా ఉన్నాయి. సాహిత్యంలో నాణ్యత, పాటలో స్పష్టత, భావంలో ఆర్ద్రత - ఈ మూడూ కలబోసుకొని పదికాలాలపాటు నిలచిపోయేలా రేడియో పాటలు పాడిన ఘనుల సూక్ష్మ పరిచయ వ్యాఖ్యలు నిజంగా అమృతవర్షాలే. సరస్సులో నివాసం ఉంటూ శిరస్సు మీద తురాయి కలిగిన నీటిబాతు విశేషాలు అలరించాయి.
-పి.చంపక్ (మాధవనగర్)
నమ్మవలసిందే!
ప్రపంచంలో జరిగే కొన్ని విచిత్ర సంఘటనలకు తార్కిక వివరణ దొరకదంటూ ‘నమ్మండి ఇది నిజం’ అని చెప్పిన ‘సహాయకుడు’ కథ నిజంగా నమ్మశక్యంగా లేకపోయినా నమ్మవలసిందే కదా! మనకు మనమే ఇష్టపూర్వకంగా పరాయి అయిపోతున్నాం. సరైన రీతిలో సంసిద్ధులం అవడమే సమర్థత అంటూ వినదగిన విశేషాలు బాగా చెప్పారు వాసిలి గారు. తప్పుదారి పట్టిన టీనేజర్స్‌ని సన్మార్గులుగా మార్చే క్రమంలో పొరపాటు పడి తామే తప్పుడు విధానం, ఆలోచనలతో బోల్తా పడిన పోలీస్ అధికారి కథ ఉత్కంఠభరితంగా ఊహించని విధంగా ముగిసింది.
-పి.శుభ (కాకినాడ)
‘గీత - మాట’
ఆదివారం అనుబంధంలో అన్ని అంశాలు బాగున్నాయి. ముందుగా మేం చదివేది ‘సండే గీత’ ‘ఓ చిన్న మాట’ ఈ శీర్షికలు చిన్నవైనా అందించే సందేశం వెల కట్టలేనిది. అక్షరాలోచనలలో కవితలు చాలా బాగుంటున్నాయి. ‘ఒక పిలుపులో పిలిచితే’ పాట పాడిన శ్రీరంగం గోపాలరత్నం గురించి తెలుసుకున్నాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఈ పాటను ఎన్నోసార్లు విన్నాం. ఎన్నో సంగతులను మాకు అందజేస్తున్న మల్లాది సూరిబాబు గారికి ధన్యవాదాలు.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)