మీకు తెలుసా ?

ఈ ఆక్టోపస్‌లకు చెవులుంటాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలపై రెండువైపులా చెవుల్లాంటి ‘్ఫన్స్’ ఉన్న ఈ జలచరాన్ని ‘డుంబో ఆక్టోపస్’ అని పిలుస్తారు. ప్రఖ్యాత వాల్ట్ డిస్నీ కేరక్టర్ డుంబో పేరు దీనికి పెట్టారు. పెద్దచెవులు, చిన్న శరీరం, ఎగరగలిగే శక్తితో కూడిన ఆ ఏనుగును పోలినట్లు ఉండటం వల్ల ఈ ఆక్టోపస్‌కు ఆ పేరు వచ్చింది. మిగతా ఆక్టోపస్‌లకు భిన్నంగా వీటికి తలపై ఇరువైపులా చెవుల్లా రెక్కల్లాంటి భాగాలుంటాయి. వీటికి ఎనిమిది చేతులు ఉండి మిగతా ఆక్టోపస్‌లకు భిన్నంగా అన్నీ ఒకదానితో ఒకటి కలసి ఒక వెబ్‌ఫుట్‌లా పనిచేస్తాయి. తలపై చెవులను ఆడిస్తూ ఇవి నీటిలో ప్రయాణం చేస్తాయి. వేగంగా వెళ్లేందుకు నీటిని వెనక్కు తోసేందుకు చేతుల్లాంటి టెంటకిల్స్‌ను వినియోగిస్తాయి. ఆహారాన్ని గుర్తించి ఒక్కసారిగా కమ్ముకుని గుటుక్కున మింగేయడం వీటి అలవాటు. సముద్రంలో 300 అడుగుల నుంచి దాదాపు 3వేల అడుగుల లోతు వరకు ఇవి జీవిస్తాయి. అందువల్ల ఇవి ఎక్కువగా కనిపించవు.

- ఎస్.కె.కె. రవళి