ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( ఫిబ్రవరి 26 నుండి మార్చి 4 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

బుద్ధిబలంతో అనుకున్న పనులు నిర్వర్తిస్తారు. మిత్రుల సాయం లభిస్తుంది. వాతావరణానుకూలంగా పనులు చేసుకోవాలి. పైకం వున్నా ఏదో వెలితిగా ఉందా అన్నట్లుంటుంది. విద్య, వృత్తి, వ్యాపార రంగాలు పోటీ తత్వాన్ని అలవరచుకుంటాయి. స్ర్తిలు మాట పొదుపు పాటించటం మేలు. ఉద్యోగానే్వషకులకు శ్రమానుకూలంగా ఫలితాలు ఉంటాయి. పెద్దల అండదండలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. స్పెక్యులేషన్ ఫలప్రదం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

మీ నిర్ణయాలకు అనుకూలంగా కార్యాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాక ప్రయోజనకరం. మీ మాటల నేర్పు ఆనందకరం. ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. అనుకోని వ్యయాలు ఇబ్బంది పెట్టేట్లుంటుంది. ఓ వార్త మిమ్ములను కలవరపరుస్తుంది. విద్యార్థులకు, పోటీ పరీక్ష అభ్యర్థులకు సరైన సమయం. ఆరోగ్యానికి మెళకువలు పాటించాలి. దంపతులు సమిష్టికై పాటుపడండి. విద్య, వ్యాపార, వృత్తి రంగాలు ఆలోచింపజేస్తాయి. స్పెక్యులేషన్ ఆలోచనలో పడేస్తుంది. హితులకు సాయం చేస్తారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ద్వంద్వ వైఖరి కూడదు. మీ హద్దుల్లో మీరు ఉండటం ఉత్తమం. పైకం సమయానికి అందుతుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. అనుకున్నవి అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగార్థులు ఉద్యోగులకు పరీక్షా సమయం అన్నట్లుంటుంది. వైవిధ్యం గల కార్యాల్లో ముందుంటారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. మితిమీరిన వేగం సర్వత్రా క్షేమం కాదు. ఇబ్బందులకు అడ్డుకట్ట వేయాలి. స్పెక్యులేషన్ లాభదాయకం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

కార్యాలు పూర్తి చేస్తారు. హితులు, రావలసిన వారు రాకపోవచ్చు. ప్రయాణాలు ఆలోచించి చేయండి. అధికారులు, పెద్దలు మీకు అండగా నిలుస్తారు. ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు గతం కంటె మెరుగవుతాయి. అనుకున్నట్లుగా అన్ని పనులు కాకపోవచ్చు. రియల్ ఎస్టేట్, సాంకేతిక రంగాలు, విదేశీ ప్రయాణాలు, విద్యార్థులకు మంచి సమయం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారున్నారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

నిరుత్సాహాన్ని దరికి రానీయకండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార, వ్యవహార నియమాదులు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఫలప్రదం. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మాట చేతల నేర్పుతో అన్నింటా ఈ వారం ముందుంటారు. విలువైనవి అందుకుంటారు. శుభ వర్తమానాలు. స్పెక్యులేషన్ దీర్ఘకాలిక ఫలప్రదం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ప్రైవేటు ఉద్యోగులకు స్థిరత్వం. ఆర్థికంగా మెరుగుపడతారు. అధిక పైకంతో ప్రయాణాలు చేయకండి. దంపతులకు శుభ ఫలిత సూచితం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఊహించని విధంగా పనులుంటాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు శ్రమానుకూలం. ఆదాయ వ్యయాలు పోటీ పడతాయి. ఖర్చులు తారుమారవనున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు గతం కంటే ఫరవాలేదనిపిస్తుంది. స్ర్తిలు అనుకున్నవి సాధిస్తారు. విందులు, వినోదాలందు మిత్రులతో కలిసి పాల్గొంటారు. ప్రయాణాలు ప్రమోదంగా ఉండేట్లు చూసుకోవాలి. స్పెక్యులేషన్ మిశ్రమం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

అవకాశాలను మీకు అనుగుణంగా మార్చుకొని పనులు పూర్తి చేస్తారు. కొన్ని కార్యాలు మెల్లగా సాగుతాయి. సమయానికి పైకం సర్దుబాటవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలు ప్రణాళికా రహితంగా చేయకండి. ఇతరులు ఏదో అంటారని మీ పద్ధతిని మార్చుకోవద్దు. వ్యాపార, వృత్తి, ఉద్యోగ రంగాలు సంతృప్తినిస్తాయి. దంపతులు ఒకే మాటపై ఉంటే బాగుంటుంది. స్పెక్యులేషన్ ఫలితానుకూలంగా ఉంటుంది. నైరాశ్యం వద్దు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

దూరదృష్టితో కార్యాలు పూర్తి చేస్తారు. అనుకోని బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. ఇతరుల సాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. అనవసర ప్రయాణాలు వాయిదా వేయడం మేలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు శ్రమానుకూలంగా సంతోష ఫలాలు. శ్రమ జీవులకు మంచి అవకాశాలు. స్పెక్యులేషన్ మిశ్రమం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అన్నింటా స్వీయ పర్యవేక్షణ అవసరం. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాలు మెరుగ్గా ఉంటాయి. విద్య, వృత్తి, వినోద, వ్యాపార, ఉద్యోగ రంగాలు గతం కంటె మెరుగు. స్ర్తిలు మంచి జీవితాన్ని చూస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు శ్రమానుకూలంగా ఉంటాయి. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. కోర్టు విషయాలు కొలిక్కి వస్తాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. మంచి వార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఓర్పు, నేర్పులతో కార్యాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు తీరిక లేకుండా చేస్తాయి. ఒక సమాచారం మీకు ఆనందాన్నిస్తుంది. రావలసిన పైకం అందుతుంది. బాకీలు వసూలవుతాయి. శుభ కార్యాల ప్రణాళికలు మెరుగు. ఉరుకులు పరుగులపై పనులు చేయవద్దు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సజావుగానే ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగుకై ప్రయత్నాలు చేపట్టండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆత్మవిశ్వాసంతో విజయావకాశాలు పొందుతారు. కష్టానికి ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ సామర్థ్యాన్ని చూపించవలసిన సమయం వచ్చింది. ఉద్యోగంలో శుభ ఫలితం. విద్య, వ్యాపారాలు సంతోషాన్నిస్తాయి. స్ర్తిలు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభ వర్తమానాలు వింటారు. మీ ప్రతిభకు విలువ వృద్ధి. ఆగిన పనులు కొన్ని పూర్తవుతాయి. స్పెక్యులేషన్ ఫరవాలేదు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారం, వ్యాపారంలో మెళకువలు, వృత్తిలో నేర్పరితనం, అన్నింటా మాటకారితనం, పొదుపరితనం గుర్తింపుని తెచ్చి పెడతాయి. ఆర్థిక స్థితిగతులు అనుకూలం. ప్రతికూల వాతావరణాన్ని కొన్నింటిలో ఎదుర్కొనవలసి వస్తుంది. మిత్రులు, బంధువులు అన్నింటా మీ వెంట ఉంటారని అనుకోవద్దు. మీ పనులు మీరే చేసుకోవాలి. ఆస్తి విలువ పెరుగుతుంది.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855