AADIVAVRAM - Others

దృష్టి ( సండే గీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడక ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా నడుస్తూ ఎంతోమందిని పరిశీలించవచ్చు. వాళ్ల వేషధారణలు, హావభావాలని గమనించవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. మనుషులకన్నా వాహనాలు ఎక్కువై పోయాయి. ఓ ఊరేగింపులో నడుస్తున్నట్టు వాహన ప్రయాణం మారిపోయింది నగరాల్లో.
ఇప్పుడు నడవాలంటే పార్కులే శరణ్యం. నగర వాసులు నడవడానికి అనువుగా వున్న ప్రాంతం పార్క్‌లు మాత్రమే. వాటిల్లో ఎంతోమంది నడుస్తూ ఉంటారు. హైదరాబాద్‌లో ఎన్నో పార్కులు ఉన్నాయి. అందులో ఇందిరా పార్క్ ఒకటి.
రకరకాల మనుషులు, రకరకాల వేష భాషలు, ఫోన్లో మాట్లాడుతూ కొంతమంది, పాటలు వింటూ మరి కొంతమంది మాట్లాడుకుంటూ ఎంతో మంది కన్పిస్తూ ఉంటారు. వాళ్లని చూస్తూ మరి కొంతమంది నడుస్తూ ఉంటారు. నడిచే వాళ్లే కాదు. నడవకుండా కూర్చొని కన్పించే వ్యక్తులు కూడా కన్పిస్తారు. కొంతమంది మన దృష్టిని ఆకర్షిస్తారు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఫౌంటెన్ దగ్గర కన్పిస్తాడు. అక్కడ ఇప్పుడు నీళ్లు లేవు. ఆయనకి డెబ్బై సంవత్సరాలు ఉంటాయి. బాదంకాయలు ఉండే కాలంలో అవి ఏరుకొని వచ్చి, వాటిని పగులగొట్టి పలుకులు తీసి ఒక ఆకులో పెట్టి అమ్ముతూ ఉంటాడు. అవి లేని సమయంలో కూడా అక్కడే కూర్చొని వచ్చిపోయే వాళ్లకి ఓ నమస్కార బాణం వేస్తూంటాడు. ఎవరో కొందరు అప్పుడప్పుడు పది రూపాయలు ఇచ్చేవారు. అలా ఇచ్చే వాళ్లలో ఒక వ్యక్తి మా మిత్రుడు.
మా మిత్రుడు కూడా వారంలో ఒకసారి పది రూపాయలు అతనికి ఇచ్చేవాడు. అతను కృతజ్ఞతగా ఓ నమస్కారం పెట్టేవాడు. మళ్లీ బాదంకాయల కాలం వచ్చేసింది. ఆ వ్యక్తి బాదం కాయలు పగులగొట్టి పలుకులు పోసి అమ్మడం మొదలుపెట్టాడు.
ఈ విషయం గురించి మా మిత్రుడు ఓ గమ్మతె్తైన విషయం చెప్పాడు. బాదం కాయల కాలం వచ్చినప్పటి నుంచి ఆ వ్యక్తి మా మిత్రుడి వైపు చూడటం మానేశాడు.
‘అతనికి ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చాను. ఈ బాదంకాయల కాలం వచ్చినప్పటి నుంచి నా వైపు అసలే చూడటం లేదు. ఉచితంగా నాకు ఇవ్వాల్సి ఉంటుందని అలా చూడటం లేదు. మనుషులకి కృతజ్ఞత లేకుండా పోతుంది’ అని మా మిత్రుడు నా దగ్గర వాపోయాడు.
‘అంత పెద్ద మాటలు ఎందుకులే. నువ్వు ఏమీ ఆశించి అతనికి డబ్బులు ఇవ్వలేదు. నీకు ఇవ్వాలనిపించింది. ఇచ్చావు. అందులో నీకు కొంత స్వార్థం కూడా ఉంది. దానం చేస్తే కొంత పుణ్యం వస్తుందని భావించి ఉంటావు అలా భావించకపోయినా మానవత్వంతో ఇచ్చి ఉంటావు. ఇప్పుడు అతను ఆ బాదం పలుకులు అమ్ముకొని ఎంతో కొంత సంపాదించుకుంటున్నాడు. అందువల్ల నీ వైపు చూడటం లేదు. ఈ దృష్టితో చూడు. అతని ప్రవర్తనలో నీకు తప్పు కన్పించదు’ అన్నాను.
నా సమాధానం మా మిత్రునికి సంతృప్తిని ఇచ్చింది. మళ్లీ ఆ వ్యక్తి ప్రస్తావన తీసుకొని రాలేదు.

- జింబో 94404 83001