నమ్మండి! ఇది నిజం!!

అక్కాచెల్లెళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్ సిటీకి రెండు గంటల దూరంలోని ఓ ఇంట్లో రాత్రి పదకొండు గంటలైంది. నిద్రపోతున్న మేరీ భయంగా కలవరిస్తోంది. ఆమె భర్త బిల్, ఫేమిలీ డాక్టర్ ఆమె పక్కనే నిలబడి అది శ్రద్ధగా వింటున్నారు.
‘ఈమె ఎందుకు ఇలా కలవరిస్తోందో నాకైతే అర్థం కావడంలేదు’ డాక్టర్ చెప్పాడు.
‘రాత్రి పదిన్నరకి టెంపరేచర్ చూస్తే నూట మూడుంది’ భర్త చెప్పాడు.
‘కాని ఇప్పుడు నార్మల్‌గా ఉంది. మలేరియా కూడా కదా. బాడీ టెంపరేచర్లో ఎందుకు ఇంత తేడా వస్తోందో నాకు తెలీడం లేదు’ డాక్టర్ చెప్పాడు.
మర్నాడు ఉదయం దినపత్రిక చదివే బిల్‌కి అగ్నిప్రమాదం వార్త కనిపించింది. అమెరికా - కెనడా సరిహద్దుల్లోని లీబెర్గ్ అనే ఊళ్లోని స్కూల్లో జరిగిన ఆ ప్రమాదంలో కొందరు పిల్లలు కాలిపోయారు. అది గత రాత్రి పదింపావుకి జరిగింది. ఇది కూడా కొన్ని రోజులుగా అనేక చోట్ల స్కూళ్లు తగలబెడుతున్న ఆర్సనిస్ట్ పనై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారని ఆ వార్తలో ఉంది.
తన భార్య వస్తున్న అలికిడి వినగానే అతను దినపత్రికని దాచేశాడు. బ్రేక్‌ఫాస్ట్ టేబిల్ ముందు కూర్చున్న మేరీ భర్త బిల్‌ని అడిగింది.
‘గుడ్ మార్నింగ్. ఇవాళ్టి దినపత్రిక ఏది?’
‘రాలేదు’ అతను అబద్ధం చెప్పాడు.
‘నేను నమ్మను. ఇవాళ పేపర్‌కి సెలవు లేదు. దాన్ని ఎక్కడ దాచారు?’
ఆమె లేచి డ్రాయర్ తెరచి చూస్తే అందులో భర్త దాచిన దినపత్రిక కనిపించింది. అందులోని ఆ అగ్ని ప్రమాదం వార్తని చదవగానే ఆమె భయంతో వణికిపోయింది. బిల్ ఆఫీస్‌కి వెళ్లాక పోలీసులకి ఫోన్ చేసింది.
‘నేను మీకు ఈ విషయం కొద్ది రోజుల ముందే చెప్పి ఉండాల్సింది. కాని భయపడ్డాను. స్కూళ్లల్లో జరిగే అగ్ని ప్రమాదాల్లో చాలామంది పిల్లలు మరణిస్తున్నారు’ చెప్పింది.
‘నిజమే. థాంక్ గాడ్. మన చుట్టుపక్కల అలాంటివి జరగడం లేదు’ లెఫ్టినెంట్ చెప్పాడు.
‘అలా అనుకోకండి. త్వరలో జరుగుతాయి. ఎందుకంటే ఆమె ఇక్కడికి వస్తోంది’
‘ఎవరు?
‘నా సోదరి ఎమిలీ. ఆమె ఈ అగ్ని ప్రమాదాలకి కారణం అని నాకు తెలుసు’
‘ఎలా తెలుసు?’
‘ఎలా అంటే ఆమె మెదడులోని ఆలోచనలు నాకు తెలుస్తూంటాయి’ మేరీ చెప్పింది.
‘అంటే?’
‘ఎమిలీ మనసులోని ఆలోచనలు నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూంటాయి. నేను నా పదో ఏట నించి ఎమిలీని చూడలేదు. కాని ఆమె ఆలోచనలు నాకు ఎప్పటికప్పుడు తెలిసిపోతూంటాయి ఈ సంగతి ఆమెకి మాత్రం తెలీదు. ఆమె మనసు నిండా భయంకరమైన చెడ్డ ఆలోచనలు. ఆమె మంచిది, దయ గలది అని అంతా అనుకునేవారు కాని ఆమె అసలు రంగు నాకు తెలుసు. మా వారికి నేను ఇది చెప్పలేదు. నాకో కవల సోదరి ఉందని కూడా ఆయనకి తెలీదు. చెప్పే సందర్భం రాలేదు’
ఆమె ఇంటికి వచ్చిన లెఫ్టినెంట్ వెంటనే బిల్‌ని, ఫేమిలీ డాక్టర్‌ని పిలిపించాడు. ఐతే వారు ఆమెకి కవల సోదరి ఉందన్న సంగతి నమ్మలేదు.
‘ఎమిలీ ఈ రాత్రి పదికి మనింటికి ఫోన్ చేస్తే మీరు నమ్ముతారా? ఆమె ఫోన్ చేసేలా నేను చేయగలను’ మేరీ చెప్పింది.
సార్జెంట్, బిల్ ఆ రాత్రి బిల్ ఇంట్లో వేచి ఉన్నారు. సరిగ్గా పదికి ఫోన్ మోగింది. బిల్ రిసీవర్ ఎత్తితే ‘మేరీ ఉందా? నా పేరు ఎమిలీ’ అని ఓ ఆడకంఠం అవతల నించి వినిపించింది. తర్వాత పెద్దగా నవ్వి ఆమె ఫోన్ పెట్టేసింది.
‘మళ్లీ ఆమె సెడార్ ఫాల్స్ కానె్వంట్‌కి నిప్పు పెట్టడానికి వెళ్లింది. ఆమెని ఆపండి’ అక్కడే ఉన్న మేరీ గట్టిగా చెప్పి స్పృహ తప్పి పడిపోయింది.
బిల్ ఆమెని పడక గదిలోకి మోసుకెళ్తే డాక్టర్ అనుసరించాడు. సార్జెంట్ రిసీవర్ అందుకుని గెయిన్స్‌స్టోన్‌లోని సెడార్ ఫాల్స్ సమీపంలోని సెయింట్ ఏన్స్ స్కూల్‌కి ఫోన్ చేశాడు.
‘అక్కడ అంతా సరిగ్గానే ఉందా?’ అడిగాడు.
‘అంతా సరిగ్గానే ఉంది...’
అకస్మాత్తుగా పిల్లల అరుపులు, ఫైరింజన్ సైరన్లు అతనికి వినిపించాయి. వెంటనే సార్జెంట్ బిల్‌ని మేరీ ఎక్కడ పుట్టిందో తెలుసుకుని పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఆ ఊళ్లోని పోలీసుస్టేషన్‌కి ఫోన్ చేసి మేరీ, ఎమిలీల వివరాలు తెలుసుకుని వెంటనే ఫోన్ చేయమని కోరాడు.
‘మీకు నిజంగా ఎమిలీ పేరుతో ఓ కవల సోదరి ఉంది కాని మీ పదో ఏట గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎమిలీ మరణించింది’ సార్జెంట్ మర్నాడు ఉదయం మేరీ ఇంటికి వచ్చి చెప్పాడు.
‘అది అబద్ధం’ మేరీ కోపంగా అరిచింది.
‘నాకు వచ్చిన సమాచారం అది’
‘నా సోదరి కాలిపోతే నాకు తెలీదా? కర్టెన్స్ మాత్రమే అంటుకుని ఎమిలీకి గాయాలయ్యాయి. కాని మరణించలేదు. ఎమిలీ బలం పుంజుకుంటోంది. ఆమెని ఆపండి..’ మేరీ ఆక్రోశంగా చెప్పింది.
‘ఆమె చేత ఫోన్ చేయించినట్లుగా ఎమిలీని ఇక్కడికి రప్పించగలరా?’ సార్జెంట్ అడిగాడు.
‘తప్పకుండా. ఇవాళ రాత్రి పదకొండుకి రైల్లో రమ్మంటాను... ఎమిలీ! ఇవాళ రాత్రి రైలెక్కు’ ఆమె పదేపదే చెప్పింది.
ఆ రాత్రి పదింముప్పావుకి సార్జెంట్, బిల్ రైల్వేస్టేషన్‌లో కలుసుకున్నారు.
‘నాకు ఇంకొంత సమాచారం అందింది. ఎమిలీ మంచి పిల్ల. మీ భార్య మేరీకి ఎమిలీ అంటే అసూయ. ఆ అగ్ని ప్రమాదాన్ని మేరీనే సృష్టించిందని పోలీసులు అనుమానపడ్డారు. ఆ తర్వాత కొంతకాలం మేరీ మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొంది న్యూయార్క్‌కి వచ్చింది’ సార్జెంట్ చెప్పాడు.
సరిగ్గా పదకొండుకి ఆగిన రైల్లో ఆఖరి పెట్టెలోంచి దిగిన యువతిని చూసి వారు ఆమె మేరీ అని మొదట భ్రమపడ్డారు.
‘ఎమిలీ?’ బిల్ ప్రశ్నించాడు.
ఆమె నిశ్శబ్దంగా అతని వంక చూసి వెయిటింగ్ రూంలోకి వేగంగా పరిగెత్తి తలుపు మూసింది. సార్జెంట్, బిల్ ఒకరితో మరొకరు చర్చించుకుని వెయిటింగ్ రూంలోకి వెళ్లారు. లోపల అగ్నిజ్వాలలు కనపడి, ఎమిలీ అరుపులు వాళ్లకి వినిపించాయి.
కాని ఆమె శవం కనిపించలేదు. ఇద్దరూ వెంటనే బిల్ ఇంటికి వెళ్లారు.
పడక గదిలో మేరీ దుప్పటి కప్పుకుని పడుకుని ఉంది. దుప్పటి లాగిన బిల్‌కి మొహం, ఒళ్లు కాలిన మేరీ కనిపించింది. ఆ సమయంలో మేరీ బయటకి వెళ్లలేదని గార్డెన్‌లో పార్టీ చేసుకునే పక్కింటి వాళ్లు చెప్పారు.
ఇలాంటి పినామినాని సైకాలజీలో బై-లొకేషన్ అంటారు. మానసిక శక్తితో ఓ వ్యక్తి ఒకేసారి రెండు ప్రదేశాల్లో ఉండగలడని అంతకు మునుపు కూడా అనేక సందర్భాల్లో రుజువైంది. అమెరికా, యూరప్‌లలో ఇలాంటి అనేక సంఘటనలు నమోదయ్యాయి. మేరీ ఎమిలీగా మారింది కూడా. సాధారణంగా కవలల్లో జరిగే దీన్ని ఎథినిక్ డబల్ అని పేరాసైకాలజీలో అంటారు. చెడ్డ ఎమిలీ నిజానికి చెడ్డ మేరీనే. ఇది ఎలా సంభవం? అది దేవుడికే తెలియాలి.

- పద్మజ