మీకు తెలుసా ?

లెమ్మింగ్స్ అంటే వీటికి ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నోయివోల్స్‌గా పిలిచే ఈ మంచు గుడ్లగూబలకు ఎలుకజాతికి చెందిన ‘లెమ్మింగ్స్’ అంటే మహాఇష్టం. మంచుతో నిండిన ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ఈ తెల్లటి గుడ్లగూబలు రోజుకు మూడు నుంచి ఐదు లెమ్మింగ్స్‌ను తినేస్తాయి. ఏడాదికి కనీసం 1600 లెమ్మింగ్స్‌ను సగటున ఒక గుడ్లగూబ తింటుందంటే వీటికి అవంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. మగపక్షులు పూర్తిగా తెల్లగాను, ఆడపక్షులు నల్లటి మచ్చలున్న తెలుపువర్ణంలోను కనిపిస్తాయి. వీటి రెక్కలు విప్పారితే రెండు అడుగుల వరకు ఉంటాయి. మూడు కేజీల బరువుతో పదేళ్ల జీవితకాలం ఉండే ఇవి మిగతా గుడ్లగూబల జాతులకన్నా భిన్నమైనవి. మిగతావి కేవలం రాత్రిపూట మాత్రమే వేటాడగలవు. పగలు వాటికి చూపు ఆనదు. కానీ ఈ మంచుగుడ్లగూబలు రాత్రీపగలూ వేటాడతాయి. అదే వీటి ప్రత్యేకత.

- ఎస్.కె.కె. రవళి