నమ్మండి! ఇది నిజం!!

అపూర్వ సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్వర్డ్ పేజ్ ఆఫీస్ నించి రెండో అంతస్థులోని తన అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నాడు. న్యూయార్క్‌లోని లక్షల మంది పౌరుల్లా అతని జీవితంలో ఎలాంటి ప్రత్యేకతా లేదు - ఓ సంఘటనని మినహాయిస్తే.
1961 సెప్టెంబర్ నెల్లో ఓ రోజు చాలా వేడిగా ఉంది. పేజ్ ఎప్పటిలా తన అపార్ట్‌మెంట్లోకి వచ్చి కోటు, టై విప్పి, సూప్ కోసం స్టౌ మీద గినె్నలో చన్నీళ్లని పెట్టి స్టౌ వెలిగించాడు. వంట గది కిటికీలోంచి చూస్తే ఎదుటి అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లోని ఓ అపార్ట్‌మెంట్లోకి మొహాన ముసుగుతో వస్తున్న ఓ వ్యక్తి పేజ్‌కి కనిపించాడు. అతని చేతిలో ఎనిమిది బేటరీల టార్చ్‌లైట్ ఉంది. అతను ఆ గది సోఫాలోని హేండ్‌బేగ్ తెరిచి అందులోని పర్స్‌ని జేబులో దోపుకోవడం, టీవీ పక్కనే గల నగల పెట్టెని తెరచి అందులోని నగలని జేబులో వేసుకుంటూండగా, అటాచ్డ్ బాత్‌రూం తలుపు తెరచుకుని నైట్‌డ్రస్‌లోని ఓ అమ్మాయి జుట్టు దువ్వుకుంటూ ఆ గదిలోకి రావడం చూశాడు. తక్షణం ఆ దొంగ కుర్చీ వెనక నక్కాడు. ఆమె దృష్టి తెరచి ఉన్న హేండ్‌బేగ్ మీద పడింది. అందులోని తన పర్స్ మాయం అవడం గమనించి, టీవీ పక్కన ఉన్న నగల పెట్టెని తెరచి చూసింది. వెంటనే ఆ దొంగ లేచి వెనక నించి ఎడంచేత్తో ఆమె నోటిని మూశాడు. పెనుగులాడే ఆమె అతని ముంజేతిని గట్టిగా కొరికి తప్పించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే ఆ దొంగ చేతిలోని బరువైన టార్చ్‌లైట్‌తో ఆమె తల మీద బలంగా మోదాడు. ఆమె వెంటనే నేల కూలడం పేజ్ చూసాడు.
‘ఒద్దు.. కొట్టద్దు’ అని పేజ్ అరిచేలోగానే అది జరిగిపోయింది. వెంటనే అతను సూప్ మరిగే స్టౌని ఆఫ్ చేసి, కోటు అందుకుని వేగంగా కిందకి వెళ్లాడు. బయట మెట్ల మీద కూర్చుని విసనకర్రతో విసురుకునే ఒకామెతో ‘హత్య జరిగింది. వెనక బిల్డింగ్‌లో, సెకండ్ ఫ్లోర్‌లో ఓ అమ్మాయిని హత్య చేశారు. పోలీసులకి ఫోన్ చేయండి. నేను అక్కడ వాళ్ల కోసం ఉంటాను’ అని చెప్పి హడావిడిగా పరిగెత్తాడు. ఆవిడ వెంటనే లేచి లోపలకి పరిగెత్తింది.
పోలీసులు వచ్చాక పేజ్ వారిని ఆ అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లాడు. వాళ్లు తలుపు తెరచి, లోపలకి వెళ్లి లైట్ వేశారు. ఆ అపార్ట్‌మెంట్ మొత్తం ఖాళీగా ఉంది. ఇందాక తను చూసిన ఒక్క ఫర్నిచర్ కూడా అందులో లేదు! ‘ఆమె శవం ఇక్కడే ఉండాలి. ఇందాక దొంగ ఇక్కడ ఉన్న కుర్చీ వెనక నక్కాడు. ఆమె ఇక్కడ సోఫాలోని...’ అలా తను చూసింది చూసినట్లు అతను వివరించాడు. కాని అంత తక్కువ సమయంలో ఆ అపార్ట్‌మెంట్ ఎలా ఖాళీ ఐందో, ఆ శవం ఏమైందో చెప్పలేకపోయాడు. తన వంక నమ్మనట్లుగా చూసే ఆ పోలీస్ ఆఫీసర్స్‌తో తను అబద్ధం చెప్పడం లేదని, తను ఎక్కడ నించి చూశాడో చెప్తూ తన ఇంటి కిటికీ వంక చూపించాడు.
‘ఇది కచ్చితంగా జరిగింది. నేను కొద్ది నిమిషాల క్రితం చూసిందే చెప్పాను. సామాను ఏమైందో తెలీదు. ఆమె తన బంగారు రంగు జుట్టుని దువ్వుకుంటోంది’ మరోసారి చెప్పాడు.
వాళ్లు అతని అపార్ట్‌మెంట్‌కి వెళ్లి కిటికీలోంచి ఆ ఎదుటి అపార్ట్‌మెంట్ వైపు చూశారు. ఎదుటి అపార్ట్‌మెంట్ కిటికీ లోంచి లోపల లైట్ వెలుగుతూండటంతో జరిగేది మొత్తం కనిపిస్తుందని గ్రహించాడు. పేజ్ వారి వెంట పోలీసుస్టేషన్‌కి వెళ్లి తను చూసింది మొత్తం స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అతనికి ఏం పాలుపోలేదు. తను చూసింది భ్రమ కాదని, కాని అంత తక్కువ సమయంలో ఆ శవాన్ని, ఫర్నిచర్ని మాయం చేయడం అసాధ్యం అని అతనికి తెలుసు.
‘ఆమె తల మీద టార్చ్‌లైట్‌తో కొట్టడం చూశానన్నారు. ఆమెకి స్పృహ తప్పి ఉండచ్చుగా? పదేపదే హత్య అని ఎందుకు అంటున్నారు?’ అతని స్టేట్‌మెంట్ ముగిసాక ఆఫీసర్ అడిగాడు.
‘ఎందుకో అది హత్యే అని నాకు తోస్తోంది’ పేజ్ జవాబు చెప్పాడు.
అతను చెప్పే దాంట్లో నిజాయితీ కనిపించడంతో పేజ్ సైకియాట్రిస్ట్ ని చూడటం మంచిదని ఆఫీసర్ సూచించాడు. అమెరికా అంతటా ప్రతీ ఏటా ఇలా పక్కింటి కిటికీలోకి చూసి, ఏదో జరుగుతోందని ఫిర్యాదు చేసేవారు చాలామంది పోలీసులకి తారసపడుతూనే ఉంటారు.
* * *
మూడు నెలల తర్వాత తలుపు తీసుకుని ఆ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన ఆ యువతి తన వొంటి మీది నగలని తీసి పెట్టెలో ఉంచి, స్నానానికి బాత్‌రూం లోకి వెళ్లింది. బయట నించి మారుతాళం చెవితో తలుపు తీసి లోపలకి వచ్చిన ఓ దొంగ చేతిలో ఎనిమిది బేటరీల టార్చ్‌లైట్ ఉంది. అతను సోఫాలోని హేండ్‌బేగ్ తెరిచి అందులోని పర్స్‌ని జేబులో దోపుకొని, టీవీ పక్కనే ఉన్న నగల పెట్టెని తెరచి అందులోని నగలని జేబులో వేసుకుంటూండగా, అటాచ్డ్ బాత్‌రూం తలుపు తెరచుకుని నైట్‌డ్రస్‌లోని ఓ అమ్మాయి జుట్టు దువ్వుకుంటూ ఆ గదిలోకి వచ్చింది. తక్షణం ఆ దొంగ కుర్చీ వెనక నక్కాడు. ఆమె దృష్టి తెరచి ఉన్న హేండ్‌బేగ్ మీద పడింది. అందులోని తన పర్స్ మాయం అవడం గమనించి, టీవీ పక్కన ఉన్న నగల పెట్టెని తెరచి చూసింది. వెంటనే ఆ దొంగ లేచి వెనక నించి ఎడం చేత్తో ఆమె నోటిని మూశాడు. పెనుగులాడే ఆమె అతని ముంజేతిని గట్టిగా కొరికి తప్పించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే ఆ దొంగ చేతిలోని బరువైన టార్చ్‌లైట్‌తో ఆమె తల మీద బలంగా మోదాడు. ఆమె వెంటనే నేల కూలింది.
హత్య జరిగినట్లు పోలీసుస్టేషన్‌కి ఫోన్ వచ్చింది. కెప్టెన్ వెంటనే సార్జంట్, లెఫ్టినెంట్లతో హత్య జరిగిన అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. అప్పటికే వేలిముద్రల నిపుణుడు. ఫొటోగ్రాఫర్ తమ పనిని చేస్తున్నారు. సార్జంట్ కిటికీలోంచి బయటకి చూస్తే ఎదుటి అపార్ట్‌మెంట్ కిటికీలో లైట్ వెలిగింది. లోపలకి వచ్చిన పేజ్ తన కోట్‌ని, టైని విప్పడం కనిపించింది. వెంటనే తామున్న అపార్ట్‌మెంట్ ఏదో ఆ పోలీస్ ఆఫీసర్‌కి గుర్తుకు వచ్చింది. వెంటనే పేజ్‌ని అక్కడికి పిలిపించారు. పోలీస్ డాక్టర్ శవాన్ని పరీక్షించి, హత్య జరిగి మూడు గంటలై ఉంటుందని, తల మీద మొద్దు పరికరంతో మోదారని చెప్పాడు. టార్చ్‌లైట్ అయి ఉండచ్చా అని సార్జెంట్ అడిగితే, అయి ఉండచ్చు, దెబ్బని బట్టి హంతకుడు బలిష్ఠుడు అని డాక్టర్ చెప్పాడు.
సార్జెంట్‌తో వచ్చిన పేజ్ పరిశీలనగా చూసి చెప్పాడు.
‘ఆ రోజు నేను చూసిన ఫర్నిచరే ఇదంతా’
పేజ్ నేరస్థుడని అనుమానించి మూడు గంటల క్రితం పేజ్ ఎక్కడ ఉన్నాడని ఆఫీసర్ ప్రశ్నించాడు. తనా హత్య చేయలేదని పేజ్ చెప్తే మూడు గంటల క్రితం జరిగిన హత్యని మూడు నెలల క్రితమే అతను ఎలా వర్ణించగలిగాడని అడిగాడు. తను హంతకుడ్ని కూడా వర్ణించానని పేజ్ జవాబు చెప్పాడు. ఆ గదిలో ఫర్నిచర్ బిల్స్ కనిపించాయి. మూడు రోజుల క్రితమే వాటిని హతురాలు మూడు వేరువేరు దుకాణాల్లో కొన్నది. మూడు రోజుల క్రితం దాకా ఆమె షికాగోలో ఉంది. న్యూయార్క్ రావడం ఆమెకి అదే మొదటిసారి. పేజ్ ఆమెని, ఆమె ఫర్నిచర్ని మూడు నెలల క్రితం ఎలా వర్ణించాడో వాళ్లకి అర్థం కాలేదు. అతన్ని పోలీసుస్టేషన్‌కి తీసుకెళ్లి నేరస్థుల ఫొటో ఆల్బంని చూపించారు. మూడు నెలల క్రితం అతను ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఏం ఉందో ఆ రోజు అలాగే జరిగిందని ఆఫీసర్ దాన్ని చదివి గ్రహించాడు. అకస్మాత్తుగా పేజ్‌కి ఓ విషయం గుర్తొచ్చింది. హంతకుడి ఎడమ చెవి కేలీఫ్లవర్లా తోచిందని చెప్పాడు. బాక్సర్లకి అలాంటి చెవి ఉంటుంది. హంతకుడు పెన్ బర్టనై ఉంటాడని వాళ్లు అనుమానించారు.
అతన్ని చూడగానే పేజ్ తను చూసిన హంతకుడు అతనే అని చెప్పాడు. కుర్చీ వెనక దాక్కుని అకస్మాత్తుగా ఆమెని వెనక నించి ఎడం చేత్తో నోరు నొక్కి చంపాడని పేజ్ చెప్పాడు. అందుకు సాక్షులు ఏరి, ఇది కట్టుకథ అని బెన్ కొట్టిపారేశాడు. ఆమె ‘అతని ఎడమ ముంజేతిని కొరికింది. ఆ గుర్తులు ఉంటాయి. చూడండి’ అని పేజ్ చెప్పాక చూస్తే బెన్ చేతి మీద కొరికిన హతురాలి పళ్ల గుర్తులు కనిపించాయి.
ఐతే హత్య జరగడానికి మూడు నెలల ముందే ఎడ్వర్డ్ పేజ్ ఆ నేరాన్ని ఎలా చూడగలిగాడు? ఇది దేవుడికే తెలియాలి.

- పద్మజ