అక్షరాలోచన

స్మార్ట్ రోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకన్నా దానితోనే
ఎక్కువ గడుపుతారు!
నాకన్నా దానితోనే
సరదాలు పంచుకుంటారు!
నాకన్నా దానే్న ఎక్కువ
ముద్దు చేస్తుంటారు!
నాకన్నా దానే్న ఎక్కువ
పక్కన పెట్టుకుంటారు!
ప్రాణమున్న దానికన్నా
లేనిదానికే విలువెక్కువ!

కనబడే నాకన్నా
కనబడని వారే మిన్న!
ఆటల్లేవు పాటల్లేవు
ముద్దుల్లేవు ముచ్చట్లేవు
అదొచ్చాక నేనసలే లేను!
దాన్ని చూస్తే ఒక్కోసారి
పగలగొట్టాలనిపిస్తుంది!
దాన్ని చూస్తే ఒక్కోసారి
విసిరెయ్యాలనిపిస్తుంది!
మామధ్య ఒక మనిషిలా వచ్చి
బంధాలను యంత్రాలు చేసింది!

ఆకలైనా నన్ను పట్టించుకోరు
చార్జింగ్ అయపోగానే పెట్టేస్తారు!
ఏడ్చినా నన్ను పట్టించుకోరు
రింగ్ అయన వెంటనే పరిగెత్తుకొచ్చి
నవ్వుతూ మాట్లాడుతుంటారు!
అనుమానమొస్తుంది ఒక్కోసారి
ఇంతకూ నన్నా, దాన్నా కన్నది!

నాకెన్ని గాయాలైనా లెక్కలేదు
అది జారిపడిందా ఎంత బాధ!
కోపంతో దాన్ని ఏమన్నా చేశానా,
అమ్మో... నన్ను చంపేయరూ!
అందుకే...
నేనే దానిలా మారితే ఎంత బాగుండు
అమ్మ ఒడిలో నాన్న చేతిలో గడిపేద్దును!

అందుకే...
నేనో స్మార్ట్ఫోన్‌లా కావాలనుంది అమ్మా!
నేనో స్మార్ట్ఫోన్‌లా కావాలనుంది నాన్నా!

- పుట్టి గిరిధర్ 9491493170