అవీ .. ఇవీ..

విమానమే ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పాత విమానాన్ని ఇంద్రభవనంగా భావిస్తున్నాడు ఓ ఇంజనీర్. ఎప్పుడూ ఏదో కొత్తదనం కోసం పరితపించే ఆ ఇంజనీర్ పేరు బ్రూస్ కాంప్‌బెల్. కాలంతీరిన బోయింగ్ 727ను తన ఇల్లుగా మార్చుకున్న అతగాడు ఏడాదిలో సగం రోజులు అందులోనే నివసిస్తున్నాడు. ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో ఆ విమానాన్ని సిమెంట్ పిల్లర్లపై నిలిపి అందులో హాయిగా గడుపుతున్నాడు. లోపల సీట్లను తనకు కావలసిన విధంగా మార్చుకున్నాడు. విమానం పనిచేసేటప్పుడు ఉండే సౌకర్యాలను అంటే లైటింగ్ వంటివి పునరుద్ధరించే పనిలో ఉన్నాడు. మిగతా ఆరునెలల కాలం జపాన్‌లో గడిపే అతగాడు తన విమానపు ఇల్లును ఎంతగానో ఇష్టపడతాడు. ఆ ఇంటిలో అతడి రాజసం ఎలా ఉందో చూడండి మరి.

- భారతి