అక్షరాలోచన

ఇదిగో వసంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదె వచ్చెనదే వసంతం
దశదిశాంతాలు కడు ప్రశాంతం

మిసమిసలాడే కిసలయాలతో
విసవిసవాలే చిలుకలతో
గోరువంకల కువకువలు
కోకిలపాటల కుహుకుహులు!

చిరుచిరుగాలుల వీవనలు
మరులురికించే భావనలు
వలపు చూపుల వయ్యారాలు
తలపుల జలధిలో తహతహలు!

గతంలోకి జారినవే
కదా - ఎన్నో వసంతాలు?
మితం లేని అందాలతో
మరల మరల నవ వసంతం
ఎప్పటికీ అది కొత్త కొత్తదే
సంకేతం మన సంతసానికి!

మచ్చలేని నీలాకాశం
మబ్బు మరక లేని అంబరం
ప్రకృతి భామ పాడే గానం
వనమయూరి చేసే నృత్యం
వింత సంతరించే వైనం
ఎంత గొప్పదీ వసంతం!

- దినకర్, 08514-248135