ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( ఏప్రిల్ 30 నుండి మే 6 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యాలకు పెద్ద మొత్తంలో పైకం కావాల్సి ఉంటుంది. ఆలోచనలతో పనులు పూర్తి చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదులు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి. పెట్టుబడులు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు అనుకున్నవి సాధిస్తారు. మీ మాట విలువ, గౌరవ మర్యాదలు వృద్ధి అవుతాయి. పథక రచన శక్తివంచన లేకుండా చేయాలి. ఆలోచనలు అనుకూలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

విలువైన వాటితో ప్రయాణాదులు శ్రేయస్కరం కాదు. వాహనంపై ప్రయాణం కంటె అంతా కలిసి ఒకే వాహనంలో వెళ్లడం మంచిది. వృత్తి, వ్యాపార, వినోద, ఉద్యోగ రంగాలందు ఆలోచనలు పెరుగుతాయి. స్వవిషయాలు బహిర్గతం చేయకండి. మీ రాజకీయాలు పరాధీనం కాకుండా చేసుకోండి. స్పెక్యులేషన్ లాభప్రదం. మంచి వార్తతో సంతోషం కలుగుతుంది. మధ్యవర్తులు మధ్యవర్తులే మరి. మీ పరిశీలన అన్నింటా మంచిది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆర్థికంగా బలోపేతమైన సమయం. వృత్తి, వ్యాపార, విద్య, వైద్య, సాంకేతిక రంగాలు అనుకున్న విధంగా మారుతాయి. దంపతులకు శ్రమానుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్ మిశ్రమం. పరిచయాలు ప్రయోజనకారి. శక్తికి మించి వ్యవహరించకండి. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. కొత్తవి ఫలించుకుంటారు. పత్రాలు, చిత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. మిత్రులతో ప్రయాణాలు, సామరస్య పరిష్కారాలు ఆవిష్కరిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అన్నింటా జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. పైకంకై ఆందోళన పడకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఆలోచింపజేస్తాయి. రియల్ ఎస్టేట్ వృద్ధి. అనుకోని సమస్యలున్నా పరిష్కరించుకొంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ దీర్ఘకాల లాభాలను కలిగిస్తాయి. శ్రమకు గుర్తింపు ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ధైర్యంగా ముందున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులు అవసరానికి సహాయపడతారు. ఆదాయం వున్నా కొన్ని ఖర్చులకై అప్పు చేయాల్సి రావచ్చు. చేపట్టిన వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ రంగాలు వృద్ధి బాటలో ఉంటాయి. తగాదాలు వద్దు. కుటుంబంలో సంతోష వృద్ధి. ఆరోగ్యంతోనే కార్యాలు సిద్ధించుకోండి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలాలను అందిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఆర్థిక స్థితిగతులు మారేట్లున్నాయి. దేనిలోనూ నిర్లక్ష్యం తగదు. హితుల ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు కుదుటపడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు ఫలించే ఉద్యోగాలున్నాయి. పొగడ్తలకు తెగడ్తలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. ధనాదాయం, స్థిరాదాయ ప్రణాళికలు లాభిస్తాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

శక్తివంచన లేకుండా కార్యాలు పూర్తి చేయనున్నారు. నిరుత్సాహం దగ్గరకు రానివ్వకండి. కొత్త సమస్యలుంటాయి. పరిష్కరించుకోవలసిన అవసరం రానుంది. ఆదాయవృద్ధి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ మన్ననలు అందుకుంటారు. స్థానచలనం ఉంది. వృత్తి వ్యాపారాదులు సంతోషాన్నిస్తాయి. స్పెక్యులేషన్ స్వల్పకాలిక వృద్ధి. పథక రచన శక్తివంచన లేకుండా చేయాలి. ఆలోచనలు అనుకూలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

కార్యసిద్ధికై ఆర్థిక ప్రగతి అవసరమని గ్రహిస్తారు. కీర్తిప్రతిష్టలు అందుకుంటారు. మీ తెలివితోనే పనులు తేలిగ్గా పూర్తవుతాయి. ఆరోగ్య ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడండి. తొందరతనం, మెతకదనం, మొహమాటం వద్దు. హితులు ప్రయోజనకారిగా మారుతారు. కుటుంబ సభ్యుల మాటలను పరిగణనలోకి తీసుకోండి. స్ర్తిలకు మంచి అవకాశం. వాహన ప్రయాణాదులందు ఆందోళన వద్దు. మీ హద్దు ముద్దు. అప్పులొద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
స్పెక్యులేషన్‌కై అప్పు చేయకండి. ఆర్థిక దశ దిశ అనుకూలం. ఆలోచనతో పనులు పూర్తి చేయండి. సమస్యలు వస్తాయి. కొత్త ఆలోచనకు ఊపిరి నిస్తాయి. చివరకు మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు, విద్యార్థులకు మంచి కాలం. ఆరోగ్యం జాగ్రత్త. మిత్రులతో ప్రయాణాలు, సామరస్య పరిష్కారాలు ఆవిష్కరిస్తారు. కుటుంబంలో సంతోష వృద్ధి. ఆరోగ్యంతోనే కార్యాలు సిద్ధించుకోండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

అవకాశానుకూలంగా వ్యవహరించండి. కోపతాపాలు వద్దు. స్వయంకృషి, పట్టుదలతో పనులు పూర్తి చేసి గుర్తింపును అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ గతం కంటె వృద్ధి. మధ్యవర్తులు మధ్యవర్తులే మరి. మీ పరిశీలన అన్నింటా మంచిది. మనసు చంచలంగా ఉన్నప్పటికీ అచంచల విశ్వాసంతో జయిస్తారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ధన వ్యయ నియంత్రణ మేలు. అదృష్ట ప్రాప్తి. ప్రయాణ లాభాలు. ప్రత్యేకతలు మీ కార్యాల్లో గోచరిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఉద్వేగభరితంగా వున్నా, సంయమనం పాటించండి. వ్యాపార విస్తరణకు సమయం. విదేశీ ప్రయత్న విజయాలున్నాయి. దంపతులు అనుకున్నవి పొందుతారు. ప్రశాంతతకై నిలకడ అవశ్యం. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు వృద్ధి. కొన్ని విషయాలు మీకు ఆనందాన్నిస్తాయి. ఆదాయానికి తగ్గ వ్యయం. అనుకోని పైకం మీ మాటతో అందుతుంది. వస్తు, వస్త్ర లబ్ధి. మీ పనులు మరొకరి చేత చేయిద్దామనుకున్నా మీరూ ఉండాలి. అప్రమత్తం అన్నింటా అవసరం. నమ్మకస్తులతో ఇబ్బందులు వస్తాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855