మీకు తెలుసా ?

వేకువవేళ పాడుతాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఈ ‘హనీఈటర్’ పక్షుల పాట మనోహరంగా ఉంటుంది. సూర్యోదయానికి ఓ గంట ముందు ఓ అరగంటపాటు మగపక్షులు అద్భుతంగా చేసే కువకువలు చెవులకు ఇంపుగా ఉంటాయి. ముక్కునుంచి కళ్లమీదుగా చెవుల వెనుక వరకు నల్లచి చారలు వీటికి కొత్త అందాన్నిస్తాయి. వీటికి తేనె అంటే చాలా ఇష్టం. పూల చుట్టూ ఎగురుతూ ప్రత్యేకంగా ఉండే ‘బ్రష్ టిప్‌డ్’ నాలుకతో తేనెను జుర్రుకుంటాయి. అయితే హమ్మింగ్‌బర్డ్‌లా ఎక్కువ సేపు గాలిలో ఎగురుతూ ఉండవు. కానీ ఆ పక్షికన్నా నేర్పుగా, తలకిందులుగా ఎంతసేపైనా వేళ్లాడుతూ పూలలోని మకరందాన్ని పీల్చుకోగలగడం వీటి ప్రత్యేకత. నిజానికి సాలెపురుగులు, చిన్నచిన్న కీటకాలు, చిన్నచిన్న ఫలాలను కూడా ఇవి ఆరగిస్తాయి. హమ్మింగ్‌బర్డ్స్‌కు వీటికి ఎటువంటి సంబంధం లేదు. తేనెటీగలు దొరికితే కాండానికి వాటిని రుద్ది తింటాయి. ఇలా ఎందుకు చేస్తాయో ఇంతవరకు కనుక్కోలేకపోయారు.?

- ఎస్.కె.కె. రవళి