అక్షరాలోచన

ఒక్కో వాక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు గోలంతా వ్యక్తీకరణతోనే
చివరి వాక్యంగానే మొదలనుకుంటూ
ముక్కలైన మనసునంతా పరుచుకుంటూ
కలకీ కలకీ మధ్య మెలకువతో
మాటకి మాటకి మధ్య వౌనంతో
నన్ను నీకు
నిన్ను నాకు అన్వయంచుకుందాం

నిజాలంటూనే మన నైజాన్ని
దూది పరుచుకున్నంత నిశ్శబ్దంగా
నేల చీలినంత ధ్యానంగా
అహాలన్నిటికీ అంత్యక్రియలు జరిపించేద్దాం

జీవితాన్ని దున్నుకుంటూ
రహస్యాల ఏరువాక కోసం
ఆకాశాన్ని అర్థించి
మేఘాల్ని మర్దించి
చినుకుల చివర్లని ముడిపెట్టేద్దాము

అంతర్మధనాల్ని అవలోకించి
రెక్కల్ని విదిలించి
ఉద్వేగాల ఊపిరందుకుని
కాలం గుర్రాల్ని అదిలించి
నిన్నటి జననమని రేపటి మరణమని
రెపరెపలాడే ఖాళీ మనసుల్ని సవరించుకుంటూ
నిర్మాణమో నిర్వాణమో
కొంత వెసులుబాటుతో చదువుకుందాం
జీవిత పుస్తకంలో ఒక్కో పుటని..

- లాస్యప్రియ కుప్పా 9640551664