అక్షరాలోచన

ఎన్నాళ్లు... ఇంకెనే్నళ్లు...!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరచేతుల్తో ఆకాశంలోని
అంతరాంతరాల... అంతరిక్షాల పీకల్ని పిసికేస్తున్నాం
పాదాలతో పాతాళాన్ని
లో లోతుల అధఃపాతాళానికి అణగద్రొక్కేస్తున్నాం
మనం త్రివిక్రములమని... మన ఉనికిని
చాటుకునే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం
ఐనా... మనమింకా... అష్టావకృలమై
మన కురూపితనాన్ని మనం దాచలేకపోతున్నాం
రాతి యుగం నుండి రాకెట్ యుగానికి
అలుపెరుగని మన ప్రస్థానంలో
ఎనె్నన్ని విజయాలో... అన్నన్ని పరాజయాలు...
అజ్ఞానం నుండి జ్ఞానానికి చేరుకున్నామని మురిసిపోతున్నాం
విజ్ఞానంతో... ఎంతో ప్రజ్ఞను కనబరుస్తున్నామంటున్నాం
కానీ... చిటికెడు - చిటికెడు సుఖాల కోసం
దోసిళ్ళ కొద్దీ ఆనందాన్ని ధారపోస్తూ జారవిడుచుకుంటున్నాం
ఇంకా మిడి మిడి జ్ఞానులుగానే మిగిలిపోతున్నాం
ఎన్ని తరాలు అంతరించినా
ఎనె్నన్ని యుగాలు గతించినా
అవగుణాల్ని వీడని హీనులుగానే మిగిలిపోతున్నాం
ఇంకానా... ఇంకెన్నాళ్ళు... ఇంకెనే్నళ్ళిలా...?!

- అనే్వషి, 7981327110