అక్షరాలోచన
నా హృదయారాధకుడా!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 May 2017
- జి.సందితా రమేష్‌కుమార్ రాజు, 9703316760
చిన్ననాటి జ్ఞాపకాలను
ఒడిలో ఒడిసి పట్టుకుని
పరువం నాటి ప్రయాణాన్ని
మది సరదాల్లో
దాచి పెట్టుకుని
పెళ్ళైన నాటినుండి
సంసార భారాన్ని
తలమీద పెట్టుకుని
ఇటు సంసారానికి
అటు ఉద్యోగానికి
సమన్యాయం
చేయాలన్న తపనతో
సతమతమవుతున్న నా పతీ
ఈ ఉరుకుల పరుగుల జీవనదిలో
ఈదుతూ...
నిను నీవే మరిచావు
నీ ఆరోగ్యాన్ని విస్మరించావు!
అలుపెరుగని ఓ ప్రయాణికుడా
నా హృదయారాధకుడా
ఈ నిశీధి సమయంలోనైనా
పవళించి శాంతించు
కలల లోకంలో విశ్రమించు