అక్షరాలోచన

జ్ఞాపకాల పుప్పొడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకాల బీరువా సర్దుతుంటే
ప్రేమలేఖ ఒకటి జారిపడింది
ఆ క్షణం
మనసూ శరీరమూ ఏకమై
గతం ఆకాశంలోకి ఎగిరిపోయ
అనుభూతి పావురమై
గిరికీలు కొడుతోంది
తన్మయత్వంతో
ఆ ముత్యాల అక్షరాలను
కంపించే పెదాలతో గోముగా ముద్దాడి
జ్ఞాపకాల మునివేళ్లతో స్పృశించాను
నా అశ్రువు ఒకటి
ఆమె సంతకంపై రాలి
అపురూప ముఖబింబమై దర్శనమిచ్చింది
తళుక్కున తారలా మెరిసి
నా వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు
ఆవిరై అదృశ్యమైంది
అనురాగం అగ్నిగుండమై
జ్ఞాపకాల సెగలు రేపుతోంది
భగ్గుమన్న గుండె బడబాగ్ని నిప్పుకణాలు
నిశీధిలో లీలగా కలిసిపోతున్నాయ
తనువు ముచ్చెమటలతో
తడిసి ముద్దయ మూల్గుతుంటే
అప్పుడు నింపాదిగా
పుస్తకం తన అక్షరాల కనులతో
నన్ను ప్రేమగా గుండెలకు హత్తుకుంటుంది
తనలోని హృదయాక్షరం
చెదిరిన నా మనస్సు లోతుల్లోకి తొంగిచూస్తూ
చెవిలో చల్లగా రహస్యం చెబుతుంది
‘‘నీది కానటువంటి
గాడి తప్పిన గతాన్ని
నెమ్మది నెమ్మదిగా
నీ మదిలోనుండి తుడిచేసుకో
మరుపు
ప్రకృతి మనిషికిచ్చిన గొప్ప వరం’’

- శిల్పా జగదీష్, 9290827384