అదిలాబాద్

చెట్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైనూర్, జూలై 13: మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణలో కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని ఎంపి గెడం నగేష్ అన్నారు. బుధవారం రెండవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎంపి గెడం నగేష్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవలక్ష్మి మండలంలో పర్యటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోచంలొద్ది కెజిబివి పాఠశాలను సంధర్శించి విద్యార్థినిలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉసేగావ్‌లోని పిహెచ్‌సిలో ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. విద్యాభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు. జైనూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కళాశాల ప్రహారిగోడ వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో మంజూరైన గురుకులం పాఠశాలను ప్రారంభించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉట్నూరు డివిజనల్ ఆర్డీవో ఐలయ్య, జడ్పీటీసీ ఆస్రం ఖానం, ఎంపిపి విమల ప్రకాష్, స్థానిక సర్పంచ్ మెస్రం లక్ష్మణ్, సర్పంచ్‌లు పెందూర్ అర్జున్, మడావి భీంరావు, మెస్రం గోవింద్‌రావు, తహసీల్దార్ శంకర్‌గౌడ్, ఎంపిడీవో దత్తరాం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఆర్‌ఐ బాబుసింగ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.