అదిలాబాద్

అయ్యో రామా.. ఇది హరితహారమా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, జూలై 18: మండలంలో హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటుటకు అధికారులు, నాయకులు ఎంతో హడావిడి చేస్తుంటే మరో పక్క చెట్లు అందుకొన్న కొంతమంది అవగాహనలేని ఉద్యోగులు, రైతులు వాటిని నాశనం చేస్తున్నారు. ఇటీవల వాంకిడి మండలంలోని వెలిగి పంచాయతికి ఇచ్చిన చెట్లు నాటడంలో కొంత మంది ఉద్యోగులు నిర్లక్ష్యం చేయడంతో పంపిణి చేసిన మొక్కలు చనిపోయాయి. ఎంతో కష్టపడి దాదాపు మూడునాలుగు నెలల తరబడి పెంచిన మొక్కలు రెండు రోజుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయాయి. ఇదిలా ఉండగా, మండలంలోని రైతులను చైతన్యంతుల్ని చేయకుండా ఏమి తెలియని గిరిజన రైతులకు వందలాది చెట్లు ఉచితంగా ఇచ్చి వాటిని పెట్టాలని దబాయించడంతో వారు మండల నర్సరీల నుండి చెట్లు గ్రామాలకు తీసుకొని వెళ్ళి వాటిని నాటకుండా పెరడులో పడవేస్తున్నారు. దీంతో గ్రామాల్లో అధికారులు అనుకొన్న చెట్ల పంపిణి లక్ష్యం నెరవేరినా, వాటిని నాటడంలేదు. మండలంలో ఈ సారి హరితహార పథకంలో 4.5 లక్షల మొక్కలను నాటడానికి టార్గెట్ పెట్టుకొన్నట్లు, కాని ఇప్పటి వరకు కేవలం 2.5 లక్షల మొక్కలు మాత్రమే పంపిణి చేసినట్లు వాంకిడి ఎంపిడిఒ అర్జున్ పవార్ చెబుతున్నారు. గ్రామాల్లో ఉచితంగా మొక్కలు నాటాలంటే రైతులు ముందుకు రావడంలేదని,మొహమాటానికి అధికారులు చెప్పినందుకు మొక్కలను తీసుకొని వెళ్ళుతున్నారే గాని వాటిని పోలాల్లో నాటడం లేదు. ఈ విషయంలో వాంకిడి ఎంపిడిఒ అర్జున్ పవార్‌తో మాట్లాడగా నాటుతాము మాకు మొక్కలు ఇవ్వండి అంటే మేము మొక్కలు ఇస్తున్నాము, అయితే వాటిని నాటకుండా పడవేస్తున్న సంగతి తన దృష్టికి రాలేదని వస్తే విచారణ జరిపి తదుపరిగా ఏం చేయాలో ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు.