అదిలాబాద్

కేసుల సత్వర పరిష్కారానికి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 28: పోలీసు అధికారులకు దర్యాప్తులో న్యాయపరమైన ఇబ్బందులు, సత్వర పరిష్కారంకోసం వారంరోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. శనివారం స్థానిక పోలీసు శిక్షణ కేంద్రంలో ఎస్సైల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఎస్సైలకు శిక్షణ పత్రాలను అందజేశారు. వారంరోజుల శిక్షణ అనంతరం నేర్చుకున్న అంశాలపై పోటీలు నిర్వహించారు. పరీక్షలో ఉత్తమ ప్రతిభకనబర్చిన ఆదిలాబాద్ టూటౌన్ ఎస్సై ఎన్.రాజేందర్, జన్నారం ఎస్సై లింగమూర్తిలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అనదపు ఎస్పీ మాట్లాడుతూ ఇటీవలే నూతన చట్టాలు అమల్లోకివచ్చాయని, ముఖ్యంగా సైబర్ నేరాలను ఎలా దర్యాప్తు చేయాలనే ప్రక్రియపై పలువురు నిపుణులతో ఎస్సైలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్పీ తరుణ్ జోషి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గ్రంథి గోపాల కష్ణమూర్తి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, ప్రభుత్వ పిపి రాంబ తదితరులు కేసుల వాదనలో ఎటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంటారనే అంశాలపై వివరించారు. బ్యాచ్‌ల వారీగా జిల్లాలోని 130మంది ఎస్సైలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పలువురు ఎస్సైలు మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ వల్ల దర్యాప్తు సమయంలో ఇబ్బందులు ఎదురుకావన్నారు. ముఖ్యంగా సైబర్ కేసులను దర్యాప్తు చేయడం నేర్చుకోవడం జరిగిందన్నారు. దర్యాప్తుల్లో ఎలాంటి లోపం లేకుండా నాణ్యత చూపించి నేరాలను రుజువు చేయు విధంగా కోర్టులో ప్రవేశపెడుతామన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం డిఎస్పీ కె.సీతారాములు, ఆర్‌ఐ ఎస్.సురేంద్ర, సిఐ జి.జయరాం, ఎస్సైలు ఆకుల అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.