తెలంగాణ

ఎంపిక నాడే పోస్టింగ్ ఆర్డర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ శాఖల్లో 904 ఎఇ పోస్టుల భర్తీ * వెల్లడించిన టిఎస్‌పిఎస్‌సి
హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) వివిధ శాఖల్లో 931 అసిస్టెట్ ఇంజనీర్ (ఎఇ) పోస్టులకు గాను 904 పోస్టులను భర్తీ చేస్తూ ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లను అందజేసింది. గత ఏడాది ఆగస్టు 20న ఈ పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 20న రాత పరీక్ష నిర్వహించి ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఈ నెల 8న ఎంపికైన అభ్యర్థుల జాబితాను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపింది. అదే రోజు పోస్టింగ్ ఆర్డర్లను అభ్యర్థులకు కమిషన్ పంపించింది. ఇరిగేషన్ శాఖలో 128, పంచాయతీరాజ్‌లో 158, పిహెచ్ అండ్ ఎంఇ శాఖలో 124, ఆర్‌డబ్ల్యూఎస్‌లో 412, రోడ్లు భవనాల శాఖలో 82 పోస్టులను భర్తీ చేసినట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది.