అంతర్జాతీయం

పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రదాడి: 20 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమాఫ్రికా : పశ్చిమ ఆఫ్రికాలోని భుర్కినాఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. రాజధాని వాగడూలోని ఐదు నక్షత్రాల హోటల్‌ల్లోకి మారణాయుధాయులతో చొరబడిన ఉగ్రవాదులు పలువురిని బందీలుగా చేసుకున్నారు. ముష్కరుల దాడిలో ఇప్పటి వరకు 20మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. హోటల్‌ బయట రెండు కారుబాంబులను పేల్చారు. ఉగ్రదాడి సమాచారంతో సైన్యం రంగంలోకి దిగింది. సైన్యం, ఉగ్రవాదుల మధ్య హోరా హోరీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల చెరలో ఎంతమంది బందీలుగా ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తామే ఈ దాడికి పాల్పడినట్లు అల్‌ఖైదా అనుబంధ సంస్థ ప్రకటించుకుంది.