అంతర్జాతీయం

అగ్నికి ఆహుతైన ప్రాచీన చర్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని అతి ప్రాచీన కట్టడమైన నోటర్ డామ్ చర్చి అగ్నికి ఆహుతైంది. దాదాపు 12వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన చర్చి అగ్నికి ఆహుతవ్వటం పట్ల క్రైస్తవ సమాజం నివ్వెరపోయింది. సోమవారంనాడు చెలరేగిన మంటల వల్ల 88 సంవత్సరాల నుంచి ఆ దేశానికి మణిహారంగా ఉంటున్న చర్చి బిల్డింగ్ మీద ఉండే పొడుగైన క‌ట్ట‌డం ఆ అగ్నిప్ర‌మాదం ధాటికి కుప్ప‌కూలింది. చ‌ర్చి పైక‌ప్పును స‌పోర్ట్ చేస్తున్న చెక్క‌లు అగ్ని ప్ర‌మాదంలో కాలిపోయాయి. దీంతో బిల్డింగ్ పైన ఉన్న పొడుగైన క‌ట్ట‌డం కూలింది. అగ్ని ప్రమాదం జ‌రిగిన ప్రాంతానికి దేశాధ్య‌క్షుడు ఎమాన్యువ‌ల్ మాక్ర‌న్ చేరుకున్నారు. చ‌రిత్ర‌కు ఆన‌వాల‌మైన చ‌ర్చిను మ‌ళ్లీ నిర్మిస్తామ‌ని మాక్ర‌న్ చెప్పారు.