రాష్ట్రీయం

అగ్రిగోల్డు వేలం నుండి వైదొలగిన సి-1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: అగ్రిగోల్డు ఆస్తులను వేలం వేసి, వచ్చిన నిధులు ఖాతాదారులకు చెల్లించేందుకు వీలుగా ముందుకు వచ్చిన సి-1 ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ఇ ఆక్షన్ నుండి వైదొలగింది. రాష్ట్ర హైకోర్టు తొలగించింది. తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ ఎస్ వి భట్‌లతో కూడిన బెంచ్ అగ్రిగోల్డుపై సోమవారం నాడు విచారణ కొనసాగించినపుడు తమకు చెల్లించే 0.2 శాతం ప్రాసెసింగ్ ఫీజు సరిపోదని, ఇ ఆక్షన్ ప్రక్రియ నుండి తాము వైదొలిగేందుకు అనుమతించాని సి-1 కంపెనీ ప్రతినిధులు న్యాయస్థానాన్ని కోరారు. ఇ ఆక్షన్ నిర్వహించేందుకు తమకు చెల్లించే శాతాన్ని పెంచాలని సి-1 ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కోరగా అందుకు త్రిసభ్య కమిటీ అంగీకరించకపోవడంతో సి-1 కంపెనీ వినతిని హైకోర్టు ఆమోదించింది. ఇ ఆక్షన్ నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను ఏజన్సీల అందుబాటును చూడాలని హైకోర్టు బెంచ్ పేర్కొనగా, పలు సంస్థలు తాము ఇ ఆక్షన్ నిర్వహించేందుకు సిద్ధమని ముందుకు వచ్చాయి. ఆసక్తి ఉన్న సంస్థలు త్రిసభ్య కమిటీని ఆశ్రయించవచ్చని పేర్కొంటూ హైకోర్టు కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సిఆర్‌డిఎ పరిధిలో తమ కంపెనీకి ఉన్న భూముల లేఅవుట్ అనుమతులను ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరగా, దరఖాస్తులను నాలుగు వారాల్లో పరిశీలించాలని ఆ మేరకు హైకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.