తెలంగాణ

మహబూబ్‌నగర్ కోర్టులో అగ్రిగోల్డ్ నిందితుల హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 11: అగ్రిగోల్డ్ సంస్థ పేరిట కోట్లాది రూపాయలు ప్రజల నుండి తీసుకుని కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ అవ్వ వెంకటరమణరావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వ వెంకటశేష నారాయణరావులను శుక్రవారం సిఐడి పోలీసులు మహబూబ్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం అగ్రిగోల్డ్ సంస్థపై కేసు నమోదు కావడంతో సిఐడి అధికారులు ఉదయం 11 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ కోర్టుకు తీసుకువచ్చారు. 12 గంటల సమయంలో కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. దాంతో సిఐడి పోలీసుల కస్టడీలో ఉన్న అగ్రిగోల్డ్ చైర్మన్‌తో పాటు మేనేజింగ్ డైరెక్టర్‌ను రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దాంతో వారిద్దరిని ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జైలుకు తరలిస్తున్నట్లు సిఐడి డిఎస్పీ మహ్మద్ ఫజ్‌లాల్ రహేమాన్ ఆంధ్రభూమి ప్రతినిధికి ఫోన్‌లో తెలిపారు. సిఐడి కస్టడీలో ఉన్న అగ్రిగోల్డ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల నుండి తీసుకున్న డబ్బులు కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నామని తమ కస్డడీ సమయం ముగియడంతో మహబూబ్‌నగర్ కోర్టులో హాజరు పరిచారు.
ఏలూరు జైలుకు తీసుకెళ్తున్నామని సిఐడి డిఎస్పీ రహేమాన్ తెలిపారు. కాగా అగ్రిగోల్డ్ చైర్మన్‌తో పాటు సంస్థ ఎండిలను మహబూబ్‌నగర్ కోర్టుకు తీసుకువచ్చారని సమాచారం తెలుసుకున్న సంస్థ ఖాతాదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి శాపనార్థనాలు పెట్టారు. అయితే ఖాతాదారులు వచ్చే సమయానికి కోర్టు నుండి సిఐడి పోలీసులు వారిని మహబూబ్‌నగర్ నుండి తీసుకెళ్లారు.