నిజామాబాద్

వ్యవ‘సాయం’ మహిళలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మార్చి 7: సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు వ్యవసాయ రంగంపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మహిళలు లేనిదే వ్యవసాయం లేదని చెప్పవచ్చు. ప్రతియేటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ మహిళల ఉన్నతిని చెప్పుకుంటున్నప్పటికీ, ఆరుగాలం శ్రమించే మహిళా రైతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేటి ఆధునీక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. భారతదేశానికి వెన్నముకగా చెప్పుకుంటున్న రైతుల్లో మహిళల పాత్రే ఎక్కువ. విత్తనాలు నాటి నుండి, పంట చేతికి వచ్చే వరకు మహిళా రైతులు చేస్తున్న కృషి అంతాఇంతా కాదు. ఇటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటునే మరోవైపు వ్యవసాయ రంగంలోనూ తమ గుర్తింపును చాటుకుంటున్నారు. బారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గ్రామాల్లో ఇలాంటి మహిళల ప్రాతినిధ్యమే ఎక్కువ. వ్యవసాయంలో యాంత్రీకరణ విధానం విస్తృతంగా పెరిగినప్పటికీ, మహిళా రైతులు నడుం భిగించనిదే ఒక్క పని కూడా ముందుకు సాగదు. వేకువజామునే 4గంటలకు నిద్రలేచి ఇంటిపని, వంటపని పూర్తి చేసుకుని, సద్దులను మూటగట్టుకుని 6గంటల కల్లా పంట పొలాలకు చేరుకునే మహిళలు సాయంత్రం 6గంటలు దాటితే గానీ ఇళ్లకు చేరుకోరు. నాట్లు వేసే సమయంలోనూ, విత్తనాలు విత్తే సమయంలోనూ, కలుపు తీయంలోనూ మహిళలే కనిపిస్తారు. విత్తనాల కొనగోళ్లు, పంట ఉత్పత్తుల విక్రయాలు, ఎరువులు చల్లడాలు తదితర పనులను మగవారు చేస్తున్నప్పటికీ, మొత్తంగా పరిశీలిస్తే వ్యవసాయం మొత్తం మహిళలదేనని చెప్పుకోవచ్చు. ప్రస్తుత తరుణంలో సాగునీరు తక్కువగా ఉండి పంటలు చేతికి అందని నేపథ్యంలో కూరగాయల పంటలు సాగు చేస్తూ కుటుంబాలకు ఆర్థికంగా కూడా మహిళలు చేయూత అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎటు చూసినా మహిళలే కనిపిస్తారు. పంటల రక్షణ విషయంలోనూ వారిదే ప్రధాన భూమిక అని కుటుంబ సభ్యులు నేరుగానే చెబుతారంటే వ్యవసాయంలో మహిళా రైతుల ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో చదువుకున్న మహిళా రైతుల కోడళ్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటూ ఆధునీక వ్యవసాయంపై పట్టు సాధిస్తున్నారు. గతంలో పంట పొలాలకు వెళ్లాలంటే వాహనాలపై భర్తలు వారిని తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మహిళా రైతులే చిన్నతరహా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకుని, తట్టాబుట్టా సర్దుకుని పంట పొలాలకు వెళ్తున్నారు. పనులు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ, వారి పిల్లలను ఉన్నత చదువులు చవిస్తూనే వ్యవసాయ పనులు నేర్పుతూ సమాజం మెచ్చుకునే రీతిలో నిష్ణాతులను చేస్తున్నారు.

దేవాలయం పనులు త్వరగా పూర్తి చేయండి
పిట్లం, మార్చి 7: పిట్లం మండలం చిన్నకొడప్‌గల్ రామలింగేశ్వర ఆలయం నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే దేవాదాయ శాఖ అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. ఆయన మహాశివారాత్రిని పురస్కరించుకుని సోమవారం పిట్లం మండలంలోని చిన్నకొడప్‌గల్ రామలింగేశ్వర ఆలయం, కుర్తిగేట్‌లో గల షిర్డీసాయి, ద్వారకామయి, కరుణామయి ఆశ్రమాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రామలింగేశ్వర ఆలయం పనులను బినామీ కాంట్రాక్టర్ చేస్తున్నాడని, మూడేళ్లు గడిచినా పూర్తి చేయడం లేదని భక్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే షిండే వెంటనే దేవాదాయ శాఖ అధికారులకు ఫోన్ చేసి కాంట్రాక్టర్ చేతనే పనులు చేయించాలని, 10వ తేదీ నుండి పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. 10వ తేదీన పనులు ప్రారంభించకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తి ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నిధులతో వేసిన బోరు ద్వారా ఆలయ గుండం నింపుతున్నామని, ఈ గుండం నిండా నీరు ఉండటంతో చుట్టు ప్రక్కల గ్రామాల పశువులకు, వన్యప్రాణుల దాహార్తి సమస్య తలెత్తకుండా ఉంటుందని భక్తులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి గుండాన్ని పరిశీలించి, త్వరలో ఆలయ కమిటీని వేస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, స్థానిక నాయకులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రజినీకాంత్‌రెడ్డి, జడ్పీటిసి ప్రతాప్‌రెడ్డి, వైఎస్ ఎంపిపి నర్సాగౌడ్, తెరాస నాయకులు అన్నారం వెంకట్‌రాంరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు సీతారామారావు కులకర్ణి, తెరాస నాయకులు సంతోష్, వెంకట్‌రెడ్డి, వాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.