అక్షర

వ్యవసాయానికి ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'The Harvest'
(ఆచార్య రాచపాళెం
చంద్రశేఖరరెడ్డి
‘పొలి’ ఆంగ్లానువాదం)
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

తెలుగునాట కనిపించే గ్రామీణ సంస్కృతికీ, ముఖ్యంగా వ్యవసాయ వృత్తి పనులకూ అద్దంపట్టే పుస్తకం ఇది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ‘పొలి’అనే పేరుతో తెలుగులో రాసిన దీర్ఘకావ్యానికి ఇది ఆంగ్లానువాదం. ‘ది హార్వెస్ట్’ అనే పేరుతో డా.పి.రమేశ్ నారాయణ దీనిని అనువదించారు.
‘పొలి’ అంటే వ్యవసాయ రంగంలో రైతులు పైరుకు ఏదయినా పురుగు పట్టినప్పుడు- దీనిని వారి పరిభాషలో ‘రోగం’ రావడం అంటారు- సస్య రక్షణ కోసం జంతువును బలి ఇచ్చి, దాని రక్తంతో కలిపిన ఎర్రటి అన్నాన్ని పొలంలో చల్లుతారు. పొలిలో బలి తప్పనిసరి. ఇది ఒక విశ్వాసంతో కూడిన జానపద ప్రక్రియ. అంతేగాక వరి పైరు పండిన తరువాత, ఆ మోపును బండరాయి మీద బాదితే వడ్లురాలడాన్ని కూడా ‘పొలి’అంటారని రచయిత ముందుమాటలో వివరించారు. దీనిలోని వస్తువు వ్యవసాయానికి సంబంధించింది. దుక్కి దున్నడం, నాట్లువేయడం మొదలుకొని కుప్పనూర్పిళ్ళ దాకా పంటను పండించే విధానమంతా చెప్పబడింది. ఇందుకోసం రైతుపడే పాట్లు, చెమటోడ్చి తాను పండించిన ధాన్యానికి ధరకట్టే అధికారం తనకు లేకపోవడం, మధ్యదళారీల దోపిడికి గురికావడం, అప్పుల్లో కూరుకుపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం వంటి అంశాల నేపథ్యంతో ఇది సాగింది.
ఒక భాషలోని సాహిత్యం మరొక భాషలోకి అనువదించబడడం అనివార్యమే. దానివల్ల ఆ భాషా సమాజంలోని స్వరూప స్వభావాలు, సాంస్కృతిక వైవిధ్యం తెలుసుకొనే వీలుకలుగుతుంది. అయితే ప్రజల జీవనశైలి, ఆచార వ్యవహారాలు, వేష భాషలకు సంబంధించిన వస్తువైతే అందరి అవగాహనకు అందుతాయి. కానీ ప్రత్యేకించి ఇటువంటి ఒక వృత్తిపరమైన విషయం తీసుకొన్నప్పుడు పాఠకునికి కూడా దానిపై ప్రత్యేక అధ్యయనం అవసరం. దీనినిండా వ్యావసాయిక సాంకేతిక, పారిభాషిక పదజాలం, మాండలికం కనిపిస్తుంది. కొన్నికొన్ని పదాలు తెలుగు వారైనప్పటికీ, ఆ నేపథ్యం లేని వారికి అర్థంకానివిగా అనిపిస్తాయి. అటువంటి ఒక బరువైన పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించడం ఒక సాహసమే. ఆ పనికి పూనుకొని డా.రమేశ్ నారాయణ కృతకృత్యులయ్యారు.
తెలుగు మూల రచనకు ఎదురు పుటలో ఆంగ్లానువాదం ఉండడంవల్ల దీనిని ఇటు తెలుగు పాఠకులు, అటు తెలుగేతరులు ఏకకాలంలో చదివే సదుపాయం ఉంది. కొన్ని వృత్తిపదాలను అనువదించడంవల్ల కలిగే ఇబ్బందుల దృష్ట్యా అనువాదకుడు వాటిని యథాతథంగా రోమన్ లిపిలోనే రాశాడు. ఉదా: ఈసుళ్ళపుట్ట= Isullaputta, పొట్టకర్ర =-Potta karra మొదలైనవి. మరికొన్ని తెలుగు మాటలకు ఇంగ్లీషు సమానార్థకాలు అనువాదం పుటలో ఉండడంవల్ల, వాటి అర్థాలు పలానా అని సుళువుగా తెలుసుకొనే సౌకర్యం ఉంది. ఉదా: జెర్రిపోతు= Krait; నెంటకాయలు= Crabs వంటివి. మొత్తంమీద ఈ అనువాదం, ఒక విలక్షణంగా కొనసాగి తెలుగు రైతును, అందునా సీమ రైతును ప్రపంచానికి పరిచయం చేసింది.

-గౌ.శం.