జాతీయ వార్తలు

అగస్టా కుంభకోణంపై రాజ్యసభలో వాగ్యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై బుధవారం రాజ్యసభలో బిజెపి, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రమేయం ఉందంటూ బిజెపి సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. ఈ సందర్భంగా సోనియా స్పందిస్తూ, కుంభకోణంలో తన పేరు ఇరికిస్తే భయపడనని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేశారు. హెలికాప్టర్ల కొనుగోలులో భారీ ఎత్తున నిధులు చేతులు మారాయని ఇటలీ కోర్టు తీర్పు చెప్పిందని, అయితే ముడుపులు ఎవరికి అందాయో తేలాల్సి ఉందని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. యుపిఎ హయంలో జరిగిన ఈ వ్యవహారంపై ఉభయసభల్లోనూ చర్చ జరగాలని బిజెపి సభ్యులు అన్నారు. తాము ఎలాంటి చర్చకైనా సిద్ధమేనంటూ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు.