గుంటూరు

19న ఎయిమ్స్ శంకుస్థాపనకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 8: మంగళగిరి పట్టణ శివారులోని పూర్వపు టీబీ శానిటోరియం ప్రాంగణంలో నిర్మించనున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)కు ఈనెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు శంకుస్థాపన జరుగుతుందని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే వెల్లడించారు. శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ శ్రీ్ధర్, జాయింట్ కలెక్టర్ 2 వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. హెలీప్యాడ్, పైలాన్ నిర్మించే స్థలం, బహిరంగ సభాస్థలి, పార్కింగ్, ఇతర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి నడ్డా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఇతర కేంద్రమంత్రులు శంకుస్థాపన కార్యక్రమం జరుపుతారని అన్నారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు జిల్లా కలెక్టర్ పుసూచనలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలోని వైద్య కళాశాలల నుంచి సుమారు ఐదువేల మందికి పైగా వైద్య విద్యార్థులను కార్యక్రమానికి తీసుకు వచ్చే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూడాలని కలెక్టర్ కాంతీలాల్ దండే కోరారు. డ్రెస్‌కోడ్‌లో వైద్య విద్యార్థులు ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వైద్య విద్యార్థులకు, బహిరంగ సభలో పాల్గొనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా స్థ్భాస్థలికి సాధ్యమైనంత దగ్గర్లోనే వాహనాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. శంకుస్థాపన జరిగే ప్రాంతానికి వచ్చే రహదారి సరిగా లేనందున ఆర్ అండ్ బి అధికారులు దాన్ని బాగు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు స్థానికంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చూస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, ప్రజలను ఇక్కడికి తీసుకు వచ్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించు కోవాలని కలెక్టర్ ఆదేశించారు. 193 ఎకరాల్లో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుందని, ఇప్పటికే ఈ స్థలంలో ఉన్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని ఆయన విలేఖర్లకు తెలిపారు. పోలీసు, రెవిన్యూ, అగ్నిమాపక, రవాణా, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయితీరాజ్ మొదలైన ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.