జాతీయ వార్తలు

ఎన్నికల సభలో కన్నీరు పెట్టుకున్న ఆజాంఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయటం ఆయనకు రివాజు. ఆయన మాటలకు ప్రత్యర్థి అభ్యర్థి, సినీ నటి జయప్రద ఎన్నోసార్లు కన్నీటి పర్యంతం అయ్యారు. దివంగత నేత సుష్మాస్వరాజ్ సైతం మహిళలను కించపరుస్తూ ఆజాంఖాన్ చేసే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించేవారు. అంతెందుకు నిండు సభలో సభాపతిగా వ్యవహరిస్తున్న మహిళా స్పీకర్‌పై సైతం ఆజాంఖాన్ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అలాంటి యూపీ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఈరోజు ఎన్నికల సభలో మాట్లాడుతూ కన్మీళ్లు పెట్టుకున్నారు. తనపై కోళ్లు, మేకలు దొంగిలించారని కేసులు పెట్టారని వాపోయారు. రాంపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో తన భార్య తజీన్ ఫాతిమా పక్షాన ప్రచారం చేస్తూ సభలో కన్నీరు పెట్టుకున్నారు. ఇన్ని నిందలు ఎందుకు భరిస్తున్నానంటే రాంపూర్ ప్రజల కోసం అంటూ చెప్పుకొచ్చారు. కాగా మహ్మద్ అలీ జవహార్ విశ్వ విద్యాలయానికి చెందిన భూములను అక్రమంగా ఆక్రమించారంటూ ఆజాంఖాన్‌పై 80 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది.