అక్షర

నిజంగానే.. ఆమె అసమాన అనసూయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింజమూరి సీత, అనసూయ అనే అక్కచెల్లెళ్లు ఒకప్పుడు, తమ జానపద గీతాలతో ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించారు. వారిలో అనసూయ పెద్దది. ఆమె లలిత సంగీత స్వరకర్త. ఆమె నా గురించి నేనే అంటూ తమ గురించి కొంత చెప్పుకున్నారు. ఆత్మకథలు చెప్పుకోవడంలో రెండు పద్ధతులున్నాయి. కొందరు తమ గురించి చెపుతూనే, ఆయా సంఘటనల ఆధారంగా తాము కలిసిన ఇతరులు, చూచిన ప్రాంతాలు, సంఘటనల గురించి వివరిస్తారు. ఈ రకం రచనలో రాసినవారి గురించి, వారి సమయాల్లోని చరిత్ర గురించి తెలుస్తుంది. ఇంక కొందరు చాలా ఆత్మాశ్రయంగా తమ గురించే చెప్పుకుంటారు. వారి జీవితాల్లో చెప్పుకోవడానికి అంత సామగ్రి ఉన్న సందర్భంలో ఈ రచనలు కూడా ఎంతో ఆసక్తికరంగానే సాగే వీలుంది.
‘నా పుస్తకంలో నేను కొంచెం ఎక్కువయినట్లుంది. తప్పదు. లేకుంటే మరెవరో వచ్చి క్రెడిట్ కొట్టేస్తారు’అంటారు ఈ రచయిత్రి. నిజంగానే అనసూయ జీవితంలో క్రెడిట్ ఆమెకే దక్కవలసిన సంగతులు చాలా ఉన్నాయి. పిఠాపురం యువరాజాగారి పెళ్లితో లలిత సంగీతం కంపోజింగ్ మొదలయింది. ఆ కుటుంబంతో మైత్రి సాగింది. గాంధీతో పరిచయం దొరికింది. పిఠాపురం కాలేజీలో, మేనమామ దేవులపల్లి కృష్ణశాస్ర్తీ ఏర్పాటుచేసిన సభల్లో ‘జయజయ జయప్రియ భారత జనయిత్రి’ పాట పుట్టింది. ఆ పాట, ఆ వరుస 1935నుంచి నేటివరకు నిత్యనూతనంగా సాగుతున్నదంటే క్రెడిట్ కాదూ మరి! కుర్రకవి శ్రీశ్రీ మరోప్రపంచం పాటకు ఈమె ట్యూన్ కట్టారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ పాడి కట్టమంచి, సర్వేపల్లి గారలచే వన్స్‌మోర్ అనిపించారు.
అనసూయ జీవితకథ చదువుతూ ఉంటే, కనీసం సగందాకా గొప్ప ఉత్సాహకరంగా ఉంటుంది. కళాచరిత్రలుగా నడుస్తుంది రచన. ఆసక్తి అంతంతగా ఉన్నవారికి కూడా బాగుంటుంది. గురువులు అంటే, గురుదేవులు అంటే తేడా చెపుతున్నచోట ఆమె వ్యక్తిత్వం ఆకాశం ఎత్తు ఎదుగుతుంది. అరమరికలు, దాపరికం లేకుండా అభిప్రాయాలు చెపుతుంటే, అవునా? అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం 95 ఏళ్ల వయసున్న ఈ గాయని జీవితం అంత ఆనందమయంగా సాగలేదు. అందుకే రచనలో కూడా వ్యక్తి జీవితం మొదలయ్యే చోటినుంచి పెద్ద మార్పు కనబడుతుంది.
అనసూయగారు అమెరికాలో ఉంటున్నారు. ఎందుకో గానీ, ఆమె ఈ పుస్తకంలో చెల్లెలు గురించి చెప్పలేదు. సీత గురించి తెలిసిన వారికిది పెద్ద ప్రశ్న. అనసూయను వ్యక్తిగతంగా ఎరిగినవారికి జవాబు కూడా ఇందులోనే దొరుకుతుంది. ఎందుకోగాని, బొమ్మలన్నీ చివరన వేశారు. మంచి కాగితం వాడినా బొమ్మలు అచ్చయిన తీరు బాగుండలేదు. వాటితో మరిన్ని వివరాలు ఇస్తే బాగుండేది.

-గోపాలం. కె.బి.