అక్షర

భ.జ.రా ప్రవృత్తికి అద్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1934లో జన్మించిన భమిడిపాటి జగన్నాథరావుగారు ఎందరో రాసే కథకులకూ, రాయని భాస్కరులకూ పెద్దదిక్కు; గౌరవాస్పదులు. దీనికి రెండుమూడు ముఖ్యమైన కారణాలు ఉన్నై. అవి ఆయన గడించుకున్న విస్తృతమైన అధ్యయనం, వివేచనతో కూడిన విశే్లషణ, ఆచితూచి మాట్లాడే వివేకం. ఇస్మాయిల్ అన్నట్టు ఆయనది చేతనా సౌకుమార్యం’. ‘సున్నితమైన అనుభూతులకు తీవ్రంగా కదిలిపోతారాయన. అత్తలూరి వారన్నట్టు ‘కథలకీ, అధికార కసరత్తులకీ మధ్య వెలుగుతూ, నలుగుతూ తిరుగుతున్న భజరాగారు మంచి కథలకు అతి మంచి పాఠకుడు, ప్రచారకుడు.
జగన్నాథరావుగారి వ్యక్తిత్వం, సాహిత్య వ్యక్తిత్వం- ఈ ‘పరస్పరం’ పుస్తకంలో కనిపిస్తాయి.ప్రముఖ రచయితలు ఆయన గురించి రాసిన 15 వ్యాసాలూ, 25 సమీక్షలూ ఉన్నై. వీటన్నిటిద్వారా భజరాగారి కథానికల్లోని గుణవిశేషాల్ని చాలావరకూ తెలుసుకోవచ్చు.
భజరాగారి కథానికలపై రాసిన ప్రముఖుల్లో ఇస్మాయిల్, అత్తలూరి నరసింహారావు, విహారి, చినవీరభద్రుడు, పెద్ద్భిట్ల సుబ్బరామయ్య, రాజారామమోహనరావు, సింగంపల్లి అశోకకుమార్, జాన్సన్ చోరగుడి, వాసుదేవరావు, చినుకురాజగోపాల్ ఉన్నారు. అలాగే, భజరాగారి కథాసంపుటాల్ని సమీక్షించిన వారిలో పురాణం, శ్రీరమణ, సుధామ, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, గుడిపాటి, వసుంధర, ద్వానాశాస్ర్తీ, సి.యస్.రాంబాబు, ఎమ్మార్వో, పాలంకి సత్యనారాయణ వంటివారు కనిపిస్తారు.‘పరస్పరం’లో జగన్నాథరావుగారు రాసిన 19 వ్యాసాల్లోనూ- భరాగో గురించీ, కారా గురించీ, త్రిపుర గురించీ, పద్మరాజు గురించీ రాసిన మంచి కథావిశే్లషణలు ఉన్నై. వీటితోపాటు 1999లో రాసిన ‘తొంభై ఏళ్ల తెలుగు కథ’ విలువైన వ్యాసమూ వుంది. ఈ వ్యాసం చివరలో - ‘మనుషులను ప్రేమించగలిగిన గురజాడ అప్పారావుగారి ఆర్ద్రత నేటికీ, ఏనాటికీ కథారచయితల ఘశజచిళఒఆ్య అవాలని నా ఆశ; ఆశయం. నా కోరిక తీరుతుందని నా విశ్వాసం’ అన్నారు.
1952లో అచ్చయిన తొలి కథ ‘వరహీనం’ మొదలు 2013లో రాసిన ‘వైదిస్’వరకూ- జగన్నాథరావుగారు రాసిన కథలు ముప్ఫైరెండు.ఈ ‘పరస్పరం’ పుస్తకంలోని విశే్లషణల్ని పరిశీలిస్తే- భజరాగారి కథల్లో మానవ సంబంధాలే ప్రధాన ఇతివృత్తాలని తేలుతుంది. ముఖ్యంగా స్ర్తిపురుష సంబంధాల గురించి విస్తృతమైన ప్రస్తావన ఉంటుందనీ అర్ధమవుతుంది. శ్రీకాంతశర్మగారన్నట్టు ‘కథకుడికి కావాల్సిన తటస్థ వైఖరితోకాకుండా, కవికీ కావల్సిన ‘ఉద్రిక్త’వైఖరితో వీరు కథలు వ్రాస్తారనీ తెలుస్తుంది.
‘పరస్పరం’లో ‘జాలి కలిగిస్తున్న నేటి తెలుగు కథ’ అని 1979లో భజరాగారు రాసిన వ్యాసం వుంది. అందులో ‘బీదవాళ్లమీద మధ్యతరగతి మనస్తత్వాల గురించి, పీడిత ప్రజానీకం తరఫున మనం- వ్రాసి, వ్రాసి- అలిసి శోషిల్లిపోయాం.అయినా, ఏవీ జరగనట్టు, తేరుకొని మళ్లా అవే తిరగరాస్తున్నాం. వెనక్కిచూస్తూ ముందుకు ఆలోచించాలి అని చెప్పడం మరీ వింత’ అని నిష్కర్షగా ఒక పరిస్థితిని అంచనావేశారు. ఇప్పటికీ ఆ పరిస్థితి అలాగే వున్నదా అనేది కథానికా రచనపట్ల ఆరాధనాభావం ఉన్న బుద్ధిజీవులు ఆలోచించాలి!

-విహారి