అక్షర

నవలా స్రవంతిలో ‘అమృత వాహిని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత్రి సుజలగంటివారు రచించిన ఈ అమృత వాహిని నవలకు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక నిర్వహించిన 2014 ఉగాది నవలల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. కేవలం తనకోసం తాను బ్రతకటం కాదు, తన వాళ్లకోసం బ్రతకటమే గొప్ప అన్న అద్భుత సూత్రాన్ని ఈ నవలలో రచయిత్రి ప్రస్ఫుటంగా చెబుతుంది. చివరకు తన వాళ్లంతా పరాయివాళ్లు అయినప్పుడూ, అనాథలను చేరదీసి వాళ్ల ఆనందంలో జీవిత పరమార్థాన్ని కనుగొన్న అమృతమూర్తి కథ ఇది.
ఈ నవలలో మూడుతరాల మనుష్యుల మనస్తత్వ చిత్రణ ద్యోతకమవుతుంది.మంజరి తల్లి, తండ్రి-మంజరి జీవితం- మంజరి కొడుకుకోడలు- ఈ మూడుతరాల వారిలో కనిపించే అంతరం- అనేక మధ్యతరగతి కుటుంబాల వారికి స్వానుభవమే. తరాల అంతరం ఎప్పుడూ మనిషి అభ్యున్నతికి సోపానం కావాలి. కానీ ఈ నాగరిక ప్రపంచంలో మనిషి అభ్యున్నతి సంకుచిత స్వార్థంతో విడదీయలేనంతగా ముడివడి పోవటమే ఈ జాతి చేసుకున్న దురదృష్టం. ఈ అంశాన్ని రచయిత్రి మంజరి పాత్రద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
మంజరి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు? ఎన్ని మలుపులు? ఎన్ని గమ్యాలు? అల్లంత దూరాన- అదుగో నింగి వంగి వంగి నేలను తాకింది- అదే గమ్యం అని పరుగిడితే- ఏం మిగిలింది? ప్రయాస తప్ప.. బ్రతుకంతా ఎడారిదారి. ఒక చల్లని జలాశయంకోసం వెతికి వెతికి వేసారిపోయింది. కన్నీరే దాహం తీర్చే సెలయేరు కావటం అన్నిటినీ మించిన దురదృష్టం... ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, మోడువారిన జీవితాన్ని మోస్తూ, అవమానాల నిప్పుల మీద నడుస్తూ చివరికెప్పుడో హృదయ వేదన దించుకోవటానికి ఒక భుజాన్ని ఆలంబనం చేసుకుంటే- అర్థం చేసుకోవాల్సిన కొడుకు ఈటెల్లాంటి మాటలతో గుండెని గాయపరుస్తాడు. సహనంలో భూదేవిని మించిపోయి అన్నిటినీ భరించింది.
నావాళ్లు నావాళ్లు అంటూ చిన్నప్పటినుంచీ ఆప్యాయత, అనురాగాలు చూపించబోతే, తోడబుట్టినవాళ్ల స్వార్థపూరిత ఆలోచనలు, వాళ్లు సంధించిన ప్రశ్నలు, తోకమీద లేచి పడగవిప్పిన మహా సర్పాల్లా బుసలుకొట్టినయి. అందరి బాగుకోసం అహరహమూ పరితపించిన మంజరికి చివరికి ఏం మిగిలింది- తను పడ్డ తాపత్రయం తప్ప?
మంజరి చిన్నతనంలో తాతగారి దగ్గర నేర్చుకున్న సంస్కృత శ్లోకాలు, శతక పద్యాలు రుజువర్తనను అలవర్చాయి. కష్టాల కొలిమిలో కాలుతున్నప్పుడూ, వాటిని తట్టుకోగల ఓర్పూ, నేర్పూ చిన్నతనంలో వొంట పట్టించుకున్న నీతి సూత్రాలవల్లనే అబ్బాయి. కర్మసిద్ధాంతం గురించి, భగవద్గీత బోధనల గురించి, విష్ణుసహస్రనామాల భాష్యాల గురించి మంజరి అనేకసార్లు విశే్లషణ చేసుకుని మానసిక ప్రశాంతత పొందుతుంది. సందర్భానుసారంగా రచయిత్రి ఈ తర్క మీమాంసలను చొప్పించటంతో ఆ పాత్రకు మరికొంత ఔన్నత్యం చేకూరింది.
కారణాలు ఏవైతేనేం, ఈతరం యువతీయువకులు ఉద్యోగానే్వషణలో ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్లిపోతున్నారు. పుట్టిపెరిగినప్పటినుంచీ జీర్ణించుకుపోయిన పద్ధతులూ, అలవాట్లు, కట్టుబాట్లూ పరాయి దేశంలోనూ పాటించాలంటే సాధ్యంకాకపోవచ్చు. కానీ కొన్ని ముఖ్యమైన వాటినైనాపాటించకపోతే, మనిషి జన్మకు సార్థకత ఏముంటుందని మంజరి బాధపడుతుంది. పరాయి దేశంలో కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నందుకు కాదు, తల్లి ఎక్కడ అడ్డుపడుతుందోనని- ఆమెను పెళ్లికి తీసుకురాడు. ఇదీ బాధించే విషయం. ఈ నిరంతర పరిణామ ఘర్షణలో మానవ సంబంధాలన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయా- అన్న సందేహమూ వస్తుంది. ఎదిగిన ప్రతివాడూ ఏకాంత ద్వీపాంతర వాసంలో చుట్టూ ఒక దుర్భేద్యమైన కోట గోడ కట్టుకుంటున్నాడు. అందులో తనూ, తన భార్య, పిలిస్తేపలికే స్వార్థమూ తప్ప- మరొకరికి చోటులేదు. తూరుపు తీరాలనుంచీ, పడమటి సాగరాల వరకూ విస్తరించిన స్వార్థపు చీకటి యవనికలను రచయిత్రి అడుగడుగునా ఆవిష్కరింపచేసింది. అయితే ఈ చీకటి తెరలమధ్య అక్కడక్కడా ఒకటి రెండు వెలుతురు కొమ్మలు, నళిని, రశ్మి రూపంలో కనిపించి కొంతవరకు ఆశ్రయమిస్తాయి. రుషి లాంటి మనిషి మంజరి. పరాయి దేశంలో, భాష కూడా పూర్తిగా తెలియని పరిసరాల మధ్య తన కాళ్లమీద తను నిలబడి అంచలంచెలుగా ఎదిగి, తను తల వంచుకుని నిలబడిన చోటునే, అందరూ తలఎత్తి చూస్తేనే గాని, తను కనిపించనంత స్థాయికి ఎదిగిన మంజరి పాత్రలో ఒక అచంచలమైన లక్ష్యసాధన, అనితర సాధ్యమైన సత్యశోధన ఒకదానితో మరొకటి మిళితమై అపురూపంగా కనిపిస్తాయి. ఇందులోని కొన్ని పాత్రలు నాకు ఎదురుపడ్డవే- అని రచయిత్రి ముందుమాటలో అంటారు. మంజరి తండ్రి గవర్నమెంటు ఆఫీసులో గుమాస్తా. చాలీచాలని జీతం. ఇలాంటి నేపథ్యంగల కుటుంబంలో పుట్టింది మంజరి. మంజరి అక్క ప్రసన్న కలల ప్రపంచంలో విహరిస్తుంది. పెద్ద ఆఫీసరు భర్తగా రావాలని కోరుకుంటుంది. తల్లీతండ్రి ఒక మధ్యతరగతి కుటుంబంలోని పిల్లవాడికిచ్చి పెళ్లిచేయాలని చూస్తే- ‘పిల్లల కోరికలు తీర్చలేనప్పుడు పిల్లల్ని ఎందుకు కన్నారు?’అని తల్లిని సూటిగా అడుగుతుంది. ఇలాంటి ప్రశ్నలువేసే పిల్లలు మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతోమంది కనిపిస్తారు! కన్న కూతురుచేత అలా అడిగించుకున్నందుకు మంజరి తల్లి కుమిలికుమిలి ఏడుస్తుంది. మంజరి తల్లికే తల్లిగా మారి ఆమెను ఓదారుస్తుంది ఆ తెలిసీ తెలియని వయసులోనే. అక్కను ఊహల పల్లకీ మీదనుంచి దించి, పెళ్లిపల్లకీ ఎక్కిస్తుంది. అన్నకు ఉద్యోగం వస్తుంది. ఆర్థికంగా ఆదుకుంటాడనుకున్న తల్లిదండ్రుల ఆశ అడియాసే అవుతుంది. ‘కన్నందుకు కొడుక్కి తిండి పెట్టాల్సిన బాధ్యత మీకు ఉంది’అని వాళ్ల బాధ్యత గుర్తుచేస్తాడుగానీ, తన బాధ్యతను మర్చిపోతాడు. తిండిపెట్టి మేపుతున్న అమ్మానాన్నలకు మాట మాత్రం చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుని పెళ్లాన్ని ఇంటికి తీసుకువస్తాడు. ఆ పిల్లకీ ఉద్యోగం ఉంది. కానీ పైసా ఇవ్వదు. భుక్తి మొత్తం మంజరి తండ్రి సంపాదన మీదే జరిగిపోతుంటుంది. వాళ్లు వేరుకాపురం పెట్టనంటారు. మంజరి తామే ఇల్లుమారిపోయే ఏర్పాటుచేస్తుంది.
మంజరికి పెళ్లి అవుతుంది. కొడుకు పుడతాడు. ఆమెకు ఇరవై ఆరేళ్ల వయస్సులోనే భర్త చనిపోతాడు. కుటుంబ భారాన్ని భుజాలమీదకు ఎత్తుకుని, ఒక స్కూల్లో టీచరుగా చేరుతుంది. కొడుకుని పెద్దవాడ్ని చేసి అమెరికా పంపిస్తుంది. కొడుకు పెళ్లికి పిలవడు కానీ, భార్య ప్రసవ సమయంలో మరో ఆడమనిషి అవసరం గనుక తల్లిని పిలిపిస్తాడు. మనవడిని చూసుకుని మురిసిపోతుంది. వాడికి సపర్యలన్నీ చేస్తుంది. పూలదండ లాంటి లేత చేతులతో పసివాడు మెడను చుట్లేస్తే, ఇంక తన జీవితం అక్కడే కడతేరిపోతుందని ఆశపడుతుంది. పిల్లవాడిని చూడటానికి ఓ ‘మనిషి’ కావాలి గనుక మంజరికి కొడుకు గ్రీన్‌కార్డు తెప్పిస్తాడు. ఇండియావెళ్లి ఒకసారి చూసి వస్తానన్నా ఒప్పుకోడు. అక్కడున్నవన్నీ తెల్సినవాళ్లచేత అమ్మించెయ్యమంటాడు. ఈ మురిపెమూ ఎన్నాళ్లో సాగదు. పిల్లాడికి అయిదేళ్లు వచ్చాయి. ఆలివైపువారు ఆత్మబంధువులైనారు. ఇప్పుడు పిల్లాడికి పనిమనిషి అక్కర్లేదు. తల్లిని ఇండియా ఆమె విచిత్రమయిన మనిషి. అది రహస్యం కానేకాదు. పుస్తకంలోకూడా అడుగడుగునా ఆమె అసమాన వ్యక్తిత్వం కనబడుతుంది.వెళ్లిపొమ్మన్నాడు. మకాం అత్తారింటికి మార్చేసాడు. ఇలాంటి నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయబడిన మంజరి- ఆ వయసులోనూ తన కాళ్లమీద నిలబడదల్చుకుంది. పరాయి దేశంలో ఏ సాంకేతిక నైపుణ్యమూ లేకుండా- ఎలా నిలబడింది, అందరికీ ఎలా ఆదర్శం కాగలిగింది. తన జీవితాన్ని ఎలా చక్కబరుచుకుంది, తిరిగి ఇండియా వచ్చి ఎలాంటి ఆశయసిద్ధికోసం పాటుబడిందీ- రచయిత్రి అతి సహజంగా మంజరి పాత్రను తీర్చిదిద్దింది.

- శ్రీ్ధర