అక్షర

తెలంగాణ జెండాలో రెపరెపలాడిన స్ర్తి చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తెలంగాణ రాజకీయాల్లో మహిళలు’’
-డా.షేక్ హసీనా
ప్రతులకు:
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

షేక్ హసీనా జర్నలిస్ట్. హైదరాబాద్ వాసి. పుట్టింది రాయలసీమ అయినా వృత్తిరీత్యా తెలంగాణ ప్రజలతో మమేకమయిన స్ర్తి. ఒక పాత్రికేయురాలిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వెనుక ఉన్న ప్రజల అసహనం పట్ల ఆమెకు పూర్తి అవగాహనా, సహానుభూతీ ఉండడంవల్ల ఆమె ఈ పుస్తకం రాయగలిగారు.
జగిర్దారీ వ్యవస్థలో, నిజాం పాలనలో చాలాకాలం ఉండడంవల్ల తెలంగాణ స్ర్తిలకు లోతుపాతులు అనుభవపూర్వకంగా తెలుసు. భూస్వాములు, ముస్లిం పాలకులు వీరిని బాధించినపుడు తిరగబడడం వీరికి తప్పనిసరైంది. తెలంగాణా సాయుధ పోరాటం, హిందువుల పోరాటం, హైదరాబాద్ విలీనోద్యమం వీటన్నిటిలో స్ర్తిలు పాల్గొన్నారు. అక్షరాస్యతతో సంబంధం లేకుండా దిగువ స్థాయినుండీ వీరిలో ఆ చైతన్యం ఉంది. అందుకే పోరాట పటిమ చూపి వీర వనితలుగా పేరుతెచ్చుకున్న సమ్మక్క సారక్క వీరికి ఆరాధ్య దేవతలయ్యారు.
ఇప్పటివరకూ 1986 నుంచీ హైదరాబాద్ నగర పాలక సంస్థలో 17 మంది కార్పొరేటర్‌లుగా ఎన్నిక కాగా 2002లో 36 మందికి పెరిగారు. హైదరాబాద్ నగర పాలక సంస్థకి మొత్తం 24 మేయర్‌లు రాగా 3 మాత్రమే మహిళలు వచ్చారు. షేక్ హసీనా తెలంగాణాలోని పది జిల్లాల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల గణాంకాలు పార్టీలపరంగా వివరంగా రాసారు. రాజకీయాల్లో కీలక పదవులు నిర్వహించి ప్రముఖంగా పనిచేసిన మహిళల ప్రొఫైల్స్ కూడా ఇవ్వడం బాగుంది.

-అల్లూరి గౌరీలక్ష్మి