అక్షర

వైవిధ్య కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-ఎనుగంటి వేణుగోపాల్
పుటలు: 101, వెల: రూ.80/-;
కె.అంజలి, ఇం.నెం.1-3-168/1,
క్రిష్ణానగర్, జగిత్యాల- 505327,
విశాలాంధ్ర (నవచేతన) అన్ని బ్రాంచీలు.

--

తెలుగు సాహిత్యం, సాంఘిక శాస్త్రాలలో ఎమ్.ఎ. పట్టాలు పొందిన ఎనుగంటి వేణుగోపాల్, పద్యరచన, నవల, మినీ కథలు, వ్యాసాలు ద్వారా తెలుగు పాఠకులకు చిరపరిచితుడు. ఆయన రాసిన కథల సంపుటాలు ఏడు పుస్తకరూపంలో ఉన్నాయి. ఎనిమిదవ కథల సంపుటం ‘వైవిధ్య కథలు’ చదువరుల ముందుకు వచ్చింది. ఈ సంపుటంలో పదమూడు కథలున్నాయి.
అత్తాకోడళ్ల సంబంధం ఇతివృత్తంగా అనేక కథలు ప్రచురింపబడ్డాయి. తల్లీకూతుళ్లలా ఉన్న అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి. పాయసం చేస్తానని అత్త, నూడుల్స్ వండుతానని కోడలు పట్టుబట్టినపుడు ఇంట్లోవారికి తినడానికి ఏం దొరికిందో తెలుసుకోడానికి ‘‘గడసరి అత్త- సొగసరి కోడలు’’ కథ చదవాలి.
వైవిధ్య కథలు

కథల పోటీలలో బహుమతి గ్రహీతనవ్వాలన్న కోరిక మరికొందరికి ఉంటుంది. ‘బహుమతి’ వచ్చింది అని సందడి చేసిన రచయితకి వచ్చిన బహుమతి ఏమిటో ‘బహుమతి’ కథ ఆఖరు వాక్యంలో కాని తెలియదు.

అవినీతి అన్ని రంగాలలోనూ వ్యాపించి ఉంది. వాలంటరీ రిటైర్మెంటు తీసుకున్న తండ్రి ఉద్యోగంలోనే అయిష్టంగా చేరతాడు కొడుకు. కార్యాలయంలో అందరూ బల్లకింద సంపాదనకి అర్రులుచాస్తున్నా కొడుకు ఆ జోలికిపోడు. కుటిల వ్యూహంవల్ల అవినీతి కేసులో ఇరికించబడి సస్పెండవుతాడు. అభిమన్యుడు లాగా వ్యూహంలో చిక్కుకుపోతాడు! అభినవ అభిమన్యుడిలా బయటపడతాడా అన్నది ‘యజ్ఞం’ కథ ఇతివృత్తం.
పేరు అచ్చులో చూసుకోవాలన్న తపన చాలామంది ఔత్సాహికులకి ఉంటుంది. కథల పోటీలలో బహుమతి గ్రహీతనవ్వాలన్న కోరిక మరికొందరికి ఉంటుంది. ‘బహుమతి’ వచ్చింది అని సందడి చేసిన రచయితకి వచ్చిన బహుమతి ఏమిటో ‘బహుమతి’ కథ ఆఖరు వాక్యంలో కాని తెలియదు.
ప్రత్యేక రాష్ట్రంకోసం ఆందోళన, సమైక్య రాష్ట్రంకోసం ఆందోళన తెలుగువారు ఈ దశాబ్దంలో చూశారు. సమైక్యవాది ‘నమస్తే తెలంగాణ’ అని మనస్ఫూర్తిగా అనడం ఎందుకు జరిగిందో ‘నమస్తే తెలంగాణ’ కథ చెపుతుంది.
అర్ధరాత్రి చీకట్లో శ్మశానం వైపు నడవడానికి చాలా గుండె ధైర్యం కావాలి. బతికున్న మనిషికి దెయ్యాలు కనబడినపుడు, మాటాడినపుడు పొందే భయం వర్ణించనలవి కానిది. పెళ్లిలో ఇచ్చిన డబ్బు చాలదని, భార్యని కిరోసిన్ పోసి చంపిన మగాణ్ణి బావమరిది హతమార్చడానికి వెళ్లి, హతుడయ్యి దయ్యమవుతాడు. ప్రేమించినవాడు గర్భవతిని చేసి పెళ్లిచేసుకోననడంతో ఆత్మహత్య చేసుకున్న కూతుర్ని మరచిపోలేక ఆత్మహత్యచేసుకుని దయ్యమవుతాడు ఇంకో తండ్రి. రెండు దయ్యాలతో మాట్లాడిన మనిషి చివరకు ఏమవుతాడు అన్నది ‘చ్... చ్... చావు!’ కథలో తెలుస్తుంది.
‘గుడి కడుతున్నాం చందాఇవ్వండి అని అడిగితే, డాక్టరు పేషెంట్లని చూస్తున్నాను సాయంత్రం రండి’ అంటారు. చందాకోరిన వ్యక్తి మీరు ఆసుపత్రి మందుల్ని ప్రైవేట్ క్లినిక్‌కి తరలిస్తున్న సంగతి నాకు తెలుసు అన్న తర్వాత కూడా డాక్టరు చందా ఇవ్వకపోడానికి కారణం అంశం చుట్టూ అల్లబడిన కథ ‘లోపల మనిషి.’