అక్షర

భిన్న మనస్తత్వాల విభిన్న కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదృష్టదీపక్ కథలు
వెల: రూ.50/-
ప్రతులకు: ఎన్.అదృష్టదీపక్
13-5-9, శివాలయం దక్షిణం వీధి
రామచంద్రపురం-533255
తూర్పుగోదావరి జిల్లా.
--

అదృష్టదీపక్ కథలు ఏకబిగిన చదివిస్తాయి. ఎప్పుడో రాసిన కథలు ఇప్పుడు పుస్తకం రూపంలో రావడం ముదావహం. చిన్న కథలతో మానవ మనస్తత్వాల్ని అద్దంపట్టి చూపారు అదృష్ట దీపక్. తన కథల ద్వారా సమాజానికి సందేశం ఇచ్చారు. ఈ కథల సంపుటికి కీర్తి అనే చిన్న కథ కలికితురాయి వంటిది. ఆదర్శాలు పలికే ఆనందరావు కుటిల మనస్తత్వాన్ని ఎత్తిచూపారు రచయిత. రాజేశ్వరిని వర్ణాంతర వివాహం చేసుకొన్న ఆనందరావు రచయితకు మిత్రుడు. సామాజిక విప్లవాలు, స్ర్తి ఆర్థిక స్వాతంత్య్రం గురించి అనర్గళంగా మాట్లాడే ఆనందరావు తన భార్యను అనుమానిస్తుంటాడు. ఒకరోజు కథకుడు ఆనందరావు ఇంటికి వెళతాడు. ‘‘ఆడదై పుట్టాక కొంచెం హద్దుల్లో ఉండాలి. నేను లేనప్పుడు ఆ చలపతిగాడు వస్తే వాడితో ఏమిటా వెకిలి నవ్వులు’’అంటూ ఆనందరావు; రాజేశ్వరి నిలదీస్తుంటాడు. అంతటితో ఆగక ఆమెపై చెయ్యి చేసుకొంటాడు. ‘ఇంతకాలం నా కళ్లముందు ఉన్న తెరపక్కకు తొలగింది’ అనే రచయిత మాటలతో కథ ముగుస్తుంది.
కాముకుడైన భూపతికి ఉచితంగా పడక సుఖాన్ని ఇచ్చి అతడి వాచీ, ఉంగరాన్ని కొట్టేసిన సుందరమ్మ ‘అవసరం’ కథలో కనిపిస్తుంది. పోకిరీ వెధవల చెంప చెళ్లుమనిపించే శైలజ పాత్రను శైలజ కథలో ఉన్నతంగా చిత్రీకరిస్తూనే ఆమె కన్నీళ్లు గురించీ చెప్పారు. నీలవేణి, చిట్టిబాబు కథకుడి మిత్రులు చెప్పుడుమాటలు వినీ నీలవేణిని, చిట్టిబాబు నిత్యం వేధిస్తున్నాడని రచయిత పొరబడతాడు. గతంలో నీలవేణిని ప్రేమించిన ప్రభాకర్ మేనమామ కూతురు సత్యవతిని పెళ్లిచేసుకుంటాడు. కానీ ఆమెను సతాయిస్తూ చావబాదుతుంటాడు. చిన్న కథలో అదృష్టదీపక్ భిన్న ధ్రువాల్ని చూపారు. పిల్లనిచ్చిన మామ తన కొడుకు చదువునాపేసి తన స్వార్థం చూసుకోవడంతో పరివర్తన చెందిన రాజారావు తనకు పెద్ద చదువులు చెప్పించిన తండ్రికి రెండువందల రూపాయలు మనియార్డరు చేస్తాడు. తేదీ మారింది అనే ఈ కథ తల్లిదండ్రుల్ని పట్టించుకోని ఈతరం కుమార రత్నాలకు కనువిప్పు వంటిది.
అదృష్టదీపక్ కవి. సినీ గీత రచయిత. అందుకేనేమో ఆయన కథల్లోకూడా కవిత్వంలాంటి పంక్తులు, పద చిత్రాలు కనిపిస్తాయి. ‘కారాగారంలోంచి బయటపడ్డ ఉద్యమ నాయకుల్లా విద్యార్థులు ప్రపంచంలో పడే వేళ- పువ్వుల్నీ, మువ్వల్నీ, గజ్జెల్నీ చూసి సూర్యకాంతి కాలేజీలో పచ్చగా పెరిగిన పచ్చిక మీద ఆనందాన్ని అభ్యాసంచేస్తున్న వేళ-’ ‘వెనక్కి రావడమంటే తెలియని అధిక ధరలలాగ కాలం మరో పది నిమిషాలు ముందుకు పరుగుతీసింది’ ‘రాజ్యలక్ష్మి నవ్వింది. కోటి వసంతాలు వెల్లివిరిసినట్టూ, ఆకాశమంతా హరివిల్లు నిండిపోయినట్టూ ఇంకా ఎలాగో... ఎలాగో... నవ్వింది.’ ‘వీధిలో ఎండదంచేస్తోంది. పదవి పోయిన నాయకుడి ఉపన్యాసంలాగ అంతకంతకూ పేట్రేగిపోతోంది! అసమ సమాజం మీద అక్షరయుద్ధం ప్రకటించిన అదృష్టదీపక్ రాయని భాస్కరుడిగా మిగిలిపోవడం మన దురదృష్టం. ఇప్పటికైనా ఆయన ఇలాంటి మంచి కథలు రాయాలని ఆశించడంలో తప్పులేదనుకుంటా.

-తెలిదేవర భానుమూర్తి