అక్షర

గానయోగ్య గేయ కావ్యంగా కాటమరాజు కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటమరాజు కథ
కవి: బొడ్డుబోయిన రాజగోపాల్
వెల: రూ.99/-
ప్రతులకు: రచయత,
9/208, శ్రీరామనగర్, రైల్వే కోడూరు-516101,
వైఎస్‌ఆర్ జిల్లా
--

జవసత్వాలున్న జాతిగా కొనసాగడానికి వీరగాధా పఠనం, మననం, శ్రవణం అవసరం.
తెలుగులో వీరగాథలపై శాశ్వత కాలీన కీర్తి ప్రదంగా పరిశోధన జరిపినవారు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు. వారామధ్య ప్రకాశం జిల్లా రచయితల సంఘం వేసిన పెద్ద పొత్తం ‘తెలుగులోగిలి’లో వీరగాథాతత్త్వంపై విశ్వజనీన అంశాల్ని వెలువరించారు. అందులో ప్రపంచంలో వీరులులేని దేశం లేదు.అలాగే వీరగాథలు లేని సాహిత్యం కూడా లేదు. డెన్మార్కు దేశంలోను, దానికి సంబంధించిన ‘ఫేరో ద్వీపాల’లోను కవిత్వమంతా వీరగాథలతోనే నిండిపోయిది. పోర్చుగీసు సాహిత్యంలో వీరగాథలు తప్ప వేరొక ప్రక్రియ కానరాదు. ఇటలీ దేశానికి చెందిన సిసిలీ ద్వీపంలో ఏడువేల వీరగాథలున్నాయని ‘పిట్’్ర అనే పరిశోధకుడు తెలియజేస్తున్నాడు అంటూ ఎన్నో ఆశక్తికర అంశాలు తెలిపారు.
భారతదేశంలో రాజస్థాన్, పంజాబు, మహారాష్టల్రు వీరగాథలకు నిలయాలు.
భారతదేశానికి సంస్కృతి దీపాలు రామాయణ, మహాభారతాలైతే ప్రత్యేకించి ఆంధ్ర సంస్కృతికి దీపాల వంటివి కాటమరాజు కథలు. ఈ కథా చక్రాలను ‘యాదవ భారతం’ అనడం కద్దు. సుద్దుల గొల్లలు, కొమ్ములవారు ఈ భారతాన్ని తమ భుజస్కందాలపై రక్షించుకుంటూ వస్తున్నారు. యాదవ రాజకీర్తి ప్రసారమైన కాటమరాజు కథను అర్ధం చేసి చదువుకోవడానికి పాడుకోవడానికి వీలుగా బొడ్డుబోయిన రాజగోపాల్ విలక్షణంగా రాసిన గేయకావ్యం ఈ కాటమరాజు కథ.లోగడ ఈ ఇతివృత్తం గాథా చక్రభాగాలుగా పాడబడుతూ వస్తూన్నప్పటికీ మరింత ప్రచారం చేయవలసిన అవసరాన్ని గ్రహించి రాజగోపాల్ రాయడం ఒక స్వచ్ఛ హృదయ సదాశయానికి చిహ్నం. ఈయన ఇప్పటికే కృష్ణలీలా శతకం, రాధామాధవం, పద్యగోపాలం గ్రంథాలు రాసి పేరుపొందిన వారే.
తెలుగు ప్రాంతాల సంస్కృతికి ఆటపట్టయిన కాటమరాజు కథలో ఆవుల మందలు తమ పోషకులవైపు వహించిన పాత్ర అద్భుతం. మానవుడు కాక పక్షిజాతిలో తెలుగు పలుకుల్ని సున్నితంగా సుకుమారంగా పలికేది చిలుక మాత్రమే...చిలుక పాత్ర కూడా ఉంది ఈ కాటమరాజు కథలో. తెలుగు గ్రామీణ సౌందర్యాలు, జనాల నైజాలు, రాజుల ప్రవృత్తులు, సామాన్యుల పాత్రలు-ఎన్నో తెలుస్తాయి ఈ కావ్య పఠనం వల్ల. ‘ఆవుల మాలె’ వంటి బ్రతుకుతెరువు వెలుగుల పండగ విశేషాలు తెలుస్తాయి.
కాటమరాజు చంద్ర వంశ క్షత్రియుడు, విష్ణువుకు 74వ తరం వానిగా, శ్రీకృష్ణ్భగవానునికి 23వ తరం వానిగా ప్రజానీకంచే కొలువబడుతున్న మహనీయుడు.
శక్తియుతుడైన కాటమరాజు ఆసక్తికర గాథను సరళసుబోధకంగా కవి బొడ్డుబోయిన రాశారు. రచనా నియమాలను పాటించడంలో పీఠికా కర్తలు పేర్కొన్నట్టు మరీ కొద్దిపాటి స్వేచ్ఛను పాటించి ఉండవచ్చు గాని ఆ వీరగాథను అంకిత స్వభావంతో ప్రచారం చేయాలనే ధ్యేయం విషయంలో నూరుపాళ్ల కృతకృత్యులయ్యారు.
కాటమరాజు క్రీశ 1216 ఫిబ్రవరి 12వ తేదీన జన్మించాడు. నిజానికి ఈ మధ్య 2016 ఫిబ్రవరి 12వ తేదీకి ఆ మహారాజు పుట్టి ఎనిమిది వందల ఏళ్లు అవడం విశేషం. దైవసమానుడుగా పూజలు పొందడం ప్రజా స్మరణలుండడం చెప్పుకోదగ్గ విశేషం.
జానపదాల గేయాల పోకడలు పుణికి పుచ్చుకోవడం ఈ గేయకావ్యానికి పరిమళాల అద్దకాలయ్యాయి.
కథా సందర్భాన-కాటమరాజు జ్ఞానాన్ని హరి గురువు పరీక్షిస్తాడు.
‘‘ముగ్గురిని పండబెట్టి, ఒక్కరిని/దగ్గర కూర్చుండబెట్టి రావలె/
పగ్గిన నీ గురువు భోజనముకని/నిగ్గుగ దెల్పి పంపించె నతడు’’
‘‘ఏ రీతిగ సన్యాసి గృహమునకు/దూరదృష్టితో చేరె తెల్పు’’మంటే-
‘‘తీరుగ నుదుట మూడు నామాలను/సారసరీతిగ పండపెట్టెను’’ అంటాడు.
ముగ్గురిని పడుకోబెట్టడమంటే నుదుట అడ్డంగా మూడు నామాలను పెట్టాడని, ఒక్కరిని దగ్గర కూర్చోబెట్టుకురావడమంటే శిష్యుడ్ని దగ్గరపెట్టుకుని వెళ్లడం’-ఇటువంటి చమత్కార అంశాలు వుంటాయి.
జానపదులకు బ్రతుకుతెరువులు సాహిత్యమూ వేరు వేరు కావని ఈ అనుసృజన గేయకావ్యం మరోసారి నిరూపిస్తుంది. ఆవు ఎద్దుల జగడము-ఎర్రయ్యల యుద్ధము వంటి శీర్షికలున్న రచనల్లో కవి వీరరసాన్ని తన రచనలో ఎలా చక్కగా పోషించారనడానికి దాఖలాలుగా ఉన్నాయి.
ఆంధ్ర మహాభారతం పదకొండవ శతాబ్దంలో ప్రభవిస్తే కాటమరాజు కథ కొంతకాలం ఇటుగా పుట్టింది.
రాజాశ్రయం చేత ఆంధ్ర మహాభారతం రాయబడితే ప్రజాశ్రయం చేత యాదవ భారతం రచితమై గానం చేయబడింది. కాటమరాజు కథ ఎలాగూ వీరగాథా చక్రాలలో ఉంది కదా అని వూరుకోక కవిగా తన రచనతో తనవంతు ప్రచార పాత్ర వహించిన రచయత ధన్యుడు. ఇది గానయోగ్య గేయకావ్యం. అనుసృజనగా అమరఫలం.

-సన్నిధానం నరసింహశర్మ