అక్షర

ఇతిహాసానికి సాంఘిక నవలా రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితమే ఒక మహాభారతం. నాటికీ, నేటికీ జీవితాల్లో సమస్య ఒకటే- అన్నతమ్ముడూ,
అక్కా, చెల్లీ కుటుంబ సంబంధాలు కూడా
గుర్తుంచుకోకుండా భూమికోసం, ఆస్తికోసం
కొట్టుకోవడం. మహాభారతం అనే ‘జయమ్’ ఒక
ఇతిహాసం. ఒక చరిత్ర. ఇది నిజంగా జరిగి
ఉంటుందని ఎక్కువమంది చరిత్రకారులు
విశ్వసించారు. వ్యాసుడి కాలంలో జీవించిన
పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘర్షణ-
పర్యవసానంగా మొదలైన యుద్ధం
జయేతిహాసంలో ఇతివృత్తం.

కురువంశ చరిత్రే మహాభారతం. ధృతరాష్ట్రుడి కుమారులు ధార్తరాష్ట్రులు. పాండురాజు కొడుకులు పాండవులు. ధార్తరాష్ట్రులు, పాండవులు- అందరూ కురువంశానికి చెందినవారే. కౌరవులే! ‘్ధర్తరాష్ట్రులు’ పలకడం కష్టంగా తోచినందువల్లనో లేక ‘కౌరవులు’ పదాన్ని పాండురాజు కొడుకులకు కూడా ఆపాదిస్తే సందిగ్ధత ఏర్పడుతుందనుకున్నారో, లేక మరో కారణంవల్లో, పాండురాజు కొడుకులు ‘పాండవులు’అయ్యారు. కాలక్రమేణా ఆ దాయాదుల మధ్య పెరిగిన వైరం చిలికి చిలికి వానై, చివరికి ధార్తరాష్ట్రుల వినాశనానికి దారితీసింది. మరి అందరూ కురువంశానికి చెందినవారే, కౌరవులే- అయితే ఓడిందెవరు? గెలిచిందెవరు?
మానవ జీవితమే ఒక మహాభారతం. నాటికీ, నేటికీ జీవితాల్లో సమస్య ఒకటే- అన్నతమ్ముడూ, అక్కా, చెల్లీ కుటుంబ సంబంధాలు కూడా గుర్తుంచుకోకుండా భూమికోసం, ఆస్తికోసం కొట్టుకోవడం. మహాభారతం అనే ‘జయమ్’ ఒక ఇతిహాసం. ఒక చరిత్ర. ఇది నిజంగా జరిగి ఉంటుందని ఎక్కువమంది చరిత్రకారులు విశ్వసించారు. వ్యాసుడి కాలంలో జీవించిన పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘర్షణ- పర్యవసానంగా మొదలైన యుద్ధం జయేతిహాసంలో ఇతివృత్తం. తనవల్ల కొనసాగిన కురువంశం తన కళ్లముందే సర్వనాశనం కావడం వ్యాసుడి మనసును క్షోభపెట్టింది. వంశ నాశనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ, మనుషులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజేస్తూ వ్యాసుడు వ్రాసిన కావ్యం ‘జయమ్’.
ఈ కావ్య నిడివి 8800 శ్లోకాలు మాత్రమే! ఈ శ్లోకాలు అన్నీ మహాభారతంలోని లక్ష శ్లోకాలలో కలసిపోయి ఉన్నాయి. క్రీస్తుశకం 4వ శతాబ్దానికి చెందిన గుప్తశాసనం ద్వారా అప్పటికి భారతం, మహాభారతం రెండూ ప్రచారంలో ఉండేవని, మహాభారతం పరిమితి లక్ష శ్లోకాలని తెలుస్తోంది. ఆనాడు నేడు మనకున్న ఆధునిక ముద్రణా సౌకర్యాలేవీ లేకపోవడంవల్ల కానీండి, మరేదో కానీండి, అనేకానేక కారణాలవల్ల, వ్యాస మహర్షి సృష్టించిన జయమ్ అనే ఈ ఇతిహాసంలోకి చిన్న చిన్న కథలు వచ్చి చేరాయి. జయమ్ భారతంగా మారి, మహాభారతంగా స్థిరపడింది.
ఈ నవలా రచయితలాగా మహాభారతం కావ్యాన్ని వ్రాసిన ప్రతి రచయితా గొప్పవాడే. ఎవరి ఆలోచనలు, అభిప్రాయాలు వారివి. ఎవరు ఎంత చేర్చినా ఎంత మార్చినా ఇన్ని వేల సంవత్సరాలపాటు భారతం నిలబడింది అంటే ఆ గొప్పదనం ఆ కథదీ, ఆ కథనానిదీ. అది వేరే విషయం. ఈ మహాభారత కథను, అందలి వివిధ పాత్రలనూ వేరేవేరే కోణాల్లో విశే్లషిస్తూ ఇటీవలి కాలంలో అనేకమంది రచనలు చేశారు కూడా.
ఆధునిక కాలక్రమంలో, గుజరాత్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అహమ్మదాబాద్ బ్రాంచికి గౌరవ డైరెక్టర్ ప్రొ.కేశవరావ్ రామ్ కె.శాస్ర్తీ. కొనే్నళ్లపాటు ఒంటరిగా శ్రమించిన కె.కె.శాస్ర్తీ విజయవంతంగా మహాభారతం నుంచి జయమ్‌ను వేరుచేశారు. 1977లో గుజరాత్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారు 8,801 సంస్కృత శ్లోకాలతో ఉన్న ‘జయసంహిత’ను ప్రచురించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, సరళమైన వ్యవహారిక భాషలో జయమ్ మూలకథ ఆధారంగా ఉపాఖ్యానాలు లేకుండా రచయిత వ్యావహారిక భాషలో, ఆధునిక దృక్పథంతో తనదైన రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ జయమ్ నవలను వ్రాశారు. ‘‘నవలా రూపంలో రాయాలని నేను అనుకోవడంలో ఉద్దేశం కొంత స్వేచ్ఛ లభిస్తుందని, ఇలా జరిగి ఉంటుంది అని ఊహించి రాయడానికి అవకాశం ఉంటుందనేది ఉద్దేశమ’’ని రచయిత చెప్పుకొచ్చారు. అందుకేనేమో, చాలా విషయాలను స్థూలంగా వివరించారు.
ఐతే, అనేక విషయాల్లో మహాభారత ఇతిహాసంపై రచయితకు భిన్నాభిప్రాయాలున్నందువల్లనేమో, శ్రీకృష్ణుడి పాత్రను చాలా పరిమితంగా ఉంచారు. లేదూ జయమ్‌లో కూడా అలానే ఉందో, మనకు తెలీదు. అలాగే వ్యవహారంలో ఉన్న రీతిలో కుంతీ పుత్ర జననం, నూరు మంది కౌరవుల జననం, ద్రౌపదీ మానసంరక్షణం వంటి వివిధ సంఘటనల గురించి మనం వేరేగా చదువుతాం ఇందులో. సాంఘిక నవల కదా అని మనం ఎంత సరిపుచ్చుకొన్నా, పాఠకులకు శ్రీకృష్ణుడి పాత్ర చిత్రణే కాదు ఇలాంటి అంశాల్లోకూడా సందేహాలు రావచ్చు. శిశుపాల వధ సందర్భంగా కృష్ణుడు తన చేతిలో సిద్ధంగా ఉంచుకొన్న చక్రం అనే అతి నూతనమైన ఆయుధాన్ని ప్రయోగించాడు (పేజీ 169) అనే వాక్యం కృష్ణుడి గురించి రచయితకున్న అభిప్రాయం చెప్పకనే చెబుతుంది.
నిరంకుశాః కవయః అన్నారు. నిజమే. కవులు నిరంకుశులు. కావచ్చు. కానీ ఈ నవలా నేపథ్యానికి ప్రజలలో ఉండే భక్త్భివన దృష్ట్యానైనా రచయిత కొంత జాగ్రత్తపడి ఉంటే బావుండేది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా మాత్రం రచనలు చేయడం మంచిది కాదు. ఈ నవలలోని కొన్ని వాక్యాలు పాత్రానుగుణంగా పండి ఉండవచ్చు. కానీ, భారతీయ స్ర్తిల పట్ల రచయితకు ఎంత గొప్ప భావం ఉందో అని అనిపించక మానదు. ఉదాహరణకు, ప్రపంచంలో ఏ స్ర్తికూడా ఒక భర్తతో తృప్తి పడదు. వీలుపడదు కానీ, ప్రతి స్ర్తి ఇంకో పురుషుడి సాంగత్యంకోసం మనసులోనైనా పరితపిస్తుంది. పాతివ్రత్యం అనేది తప్పనిసరైన మిథ్యావ్రతం. (పేజీ 129), బ్రతికుండగా వాడి కోరిక తీరలేదు. ఈ ...ను వాడితోబాటే కలిపి కాల్చేస్తే... (పేజీ 261)- ఇలాంటి వాక్యాలు ఈ నవల గొప్పదనాన్ని కొంత తగ్గిస్తాయని చెప్పక తప్పదు.
అసలు ముఖ చిత్రం చూస్తేనే మనకు రచయిత ఆలోచన కొంత అర్థమవుతుంది. ఈ నవలకు అనుబంధంగా కొన్ని వ్యాసాలూ, జయసంహిత (1977 ఎడిషన్) తాలూకు పరిచయ వాక్యాలూ జోడించారు. ఐతే, జోడించిన తెలుగు వ్యాసాలు రచయితే వ్రాశారు. వీటిలో సనాతన ధర్మం గురించి, అశ్వమేధయాగం గురించి వ్రాశారు కూడా. ప్రాణికోటికి మేలు జరగడానికి చెప్పబడిన అసత్యం సత్యం కంటే గొప్పది. కీడు కలిగించే సత్యం అసత్యంతో సమానం అని ముగించారు ఈ వ్యాసాన్ని. మరి ఏది సత్యం, ఏదసత్యం చెప్పలేదు రచయిత.
అదే వ్యాసంలో ఆయన వ్రాసిన కృష్ణుడికి దైవత్వం ఆపాదించి బలరామకృష్ణులను దశావతారాలలో చేర్చారు. మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధికెక్కింది-వంటి వాక్యాలు రచయితకు దేవుడంటే నమ్మకం లేదనే అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఏదోఒక బలవంతమైన అదృశ్యమైన శక్తి ఒకటి మనలను నడిపిస్తోందని మాత్రం రచయితే నమ్మడం గొప్ప విషయం. అన్నట్టు ఇంత గొప్ప నవలలో డిటిపి సమస్యలూ, ఒకటి రెండు అచ్చుతప్పులూ లేకపోలేదు. ఐతే అవేమీ చెప్పుకోదగ్గంత పెద్దవేమీ కావు.
మహాభారత ఇతిహాసంలో ఉండే అనేక సంఘటనలను ఇందులో మనం చూడం. తెలిసిన కథే అయినా దానిని ఒక నవలా రూపంగా చదవటం బావుంది. కథ పాతదే కానీ కథనం కొత్తది. ఇతిహాసానికి ఇది సాంఘిక నవలా రూపం. అంతే. సరళమయిన భాషలో ఉండి, చదువుతున్నంత సేపు ఆసక్తికరంగా ఉంది.

జయమ్(?)
- నాయుని కృష్ణమూర్తి,
పేజీలు- 425,
వెల- రు.250,
ప్రతులకు-
సాహితీ ప్రచురణలు,
విజయవాడ
0866-2436643
విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లి 08581- 256234

-వి.వి.వేంకటరమణ