అక్షర

రామాయణం నిత్యనూతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తర మాలిక
సంకలనం: డా॥ ఎస్. ఆర్. ఎస్. కొల్లూరి
మరియు
శ్రీమతి కె పద్మజ
మూల్యం: రూ 60/- లు
ప్రతులకు: డాక్టర్ గజల్ శ్రీనివాస్
గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్
సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్
6.3.629/2 ఎ2, కబీర్ నివాస్, ఆనందనగర్
ఖైరతాబాద్, హైదరాబాద్
సంచార వాణి: 9912626256

నదులు, కొండలు, పర్వతాలు, వృక్షాలు ఉన్నంత కాలమూ రామాయణం ఉంటుందని ఆనాడు అరవింద మహర్షి సెలవిచ్చినట్లుగానే ఈనాటికీ రామాయణ రచన ఏదో ఒక ప్రక్రియలో జరుగుతూనే ఉంది. నిరంకుశుడైన కవి తనకు తోచిన మార్గంలో ఒక నూతన సందేశాన్ని ఇవ్వాలనే ఉత్సుకతతో రాముని చరితను ఆధారంగా తీసుకొంటూనే ఉన్నాడు. అందుకే త్రేతాయుగంలోని రాముని కథను నేటికీ నిత్యనూతనంగాను, నవనవోనే్మషంతో తరతరాలకు ఆసక్తిని కలిగిస్తూనే ఉంది. ఎంత తరిచి తరిచి చూచినా సాహిత్యంలో ఇంకా ఏదో తెలుసుకొనే వస్తువేదో కనిపిస్తున్నట్టుగానే రామాయణ మనే సాగరంలో ఎందరు ఎన్ని రకాలు తవ్వినా అందులోంచి రత్నాలనే మంచి విషయాలు బయల్పడుతూనే ఉన్నాయి. అందుకే ఆమూలాగ్రం అందరూ రామాయణాన్ని తెలుసుకోవాలని అందులోని మంచిని గ్రహించి రాముని వంటి ధర్మమూర్తులు, ఆంజనేయునివంటి కర్తవ్యదీక్షాపరాయణులు, లక్ష్మణుని వంటి సేవాతత్పరులు, సీతాదేవి వంటి మహిళామణులు పుట్తూనే ఉండాలని తలచే కవులు రామాయణ రచనను కొంగొత్త రీతుల్లో సాగిస్తునే ఉన్నారు. అట్లాంటి కోవలోదే ఈ‘‘ శ్రీమద్రామాయణం -ప్రశ్నోత్తర మాలిక ’’ ఇందులో ముందుగా రామాయణంలోని వివిధాంశాలకు చెందిన విషయాలను ప్రశ్న సమాధాన రూపంలో ఇచ్చారు. దీనివలన ఏది చదవాలనే ఆసక్తి ఉన్నా మాకు సమయం లేదు. నిత్యకృత్యాలతోటే దినమంతా సరిపోతోంది అనేవారికి ఈ ప్రశ్నోత్తరమాలిక చదివినా రామాయణమంతా కూడా అర్థమయి పోతుంది. ఎవరికి ఎవరు ఏ రకమైన సంబంధీకులో కూడా ఈ ప్రశ్నోత్తరమాలిక చదివితే అవగాహన కలుగుతుంది. కనుక ఈ ‘‘శ్రీమద్రామాయణం’’ చదివి రాముని గూర్చిన వివరాలను అతిసులభంగా తెలుసుకోవచ్చు. పైగా రాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు లాంటి వారి గురించి కూడా ముందుమాటలో ప్రొ॥ ప్రకాశరావు వెలగపూడి వారు సంక్షిప్తంగా వివరించారు.
సరళమైన పొందికయైన భాషలో సుమారు 1306 ప్రశ్నలు సమాధానాలతో రామాయణాన్ని అందించే ఈ పుస్తకాన్ని పిల్లలే కాక పెద్దలుకూడా చదివి విషయావగాహనకు రావచ్చు ననే అభిప్రాయం చదువరిలో కలిగిస్తుంది.

-రాయసం లక్ష్మి