అక్షరాలోచన

అట్లాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లాసంతా అస్తవ్యస్తంగా ఉంది
అన్ని ఖండాలు అట్టుడికిపోతున్నాయి
అన్ని ‘వాదా’లను ఐక్యవాదంతో తరమాలని
అన్ని దేశాలకు ఐ.రా.స. పిలుపునిచ్చింది
ఆఘమేఘాల మీద ఆర్భాటంగా
అందరు ప్రతినిధులు వేదిక చేరారు
అణు విస్ఫోటనాలను అంగిటిలో పెట్టుకుని
ధృతరాష్ట్ర కౌగిళ్లు పంచుకున్నారు
పరస్పర నిందారోపణల పర్వంలో
హడావుడి హుళక్కి నిర్ణయాలు
కాగితాల దొంతరల మీద కావ్యాలు రాశాయి
కసాయి కొలిమిలో అమరత్వం చెందిన చెట్టు

కాలుతున్న మానవుడు
కష్టాలు తొలగనున్నాయని కళ్లు తుడుచుకున్నాడు
ఉలిక్కిపడ్డ ఉగ్రవాదం ఒక్క క్షణం ఆలోచించి
ఉడత వూపులే కదా యివని వెర్రినవ్వు నవ్వింది
ప్రళయానికి ప్రళయానికి మధ్య ప్రశాంతిలా
కొన్ని ఘడియల కొలమానం శాంతించింది
పైరెప్పను కింది రెప్ప తాకకముందే
పైశాచికం మళ్లీ ప్రచండ తాండవం చేసింది
అడుగడుగునా అట్లాసంతా రుధిరం దిద్దుకుంది
మాట్లాడలేని మనిషి మిడతలా కాలిపోతున్నాడు
ఎప్పటిలాగే ఐక్యవాదం మళ్లీ తెరపైకి వచ్చింది
గుడిపూడి జంగాలన్నీ మళ్లీ కొలువుతీరాయి.

-శివంగరాజు శ్రీనివాసరావు 9052048706