అక్షర

మురిపించే హోసూరు కతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోసూరు కతలు
జతగాళ్లు, కతగాళ్లు
(కథా సంకలనం)
పేజీలు- 120,
వెల- 55 రు.
రచయితలు-
కెం.మునిరాజు,
గౌనోళ్ల సురేశ్‌రెడ్డి
ప్రతులకు- మంచి పుస్తకం, తార్నాక, సికింద్రాబాద్. ఫోన్- 9490746614
***
తెలుగు చదివేవాడు శుంఠ. ఆంగ్లంలో చదవాలి, మాట్లాడాలి అపుడే మనుగడ. అదే గొప్ప! అనేవాళ్లు ఇప్పటికే చాలామంది మెకాలే మనవళ్లనూ, ముని మనవళ్లనూ తయారుచేశారు. నిజానికి పాలకులెలా ఉంటారో, కాలం అలాగే ఉంటుంది. కాలాన్నిబట్టి జనాలు వెళ్తారు. అందుకే ఆ కాలంలో రాజులు మన భాషా సాహిత్యాలకు పెద్దపీట వేశారు. దానికి తగ్గట్టే జనమూ ఉండేవారు. సాధారణ జనాల్లో సైతం కవితా స్పృహ, కనీస పాండిత్యం వెల్లివిరిసేది. నేటి ప్రపంచీకరణ ముసుగులో అన్ని భాషలకుమల్లే మన తెలుగు భాషకూ తెగులు పట్టిస్తున్నారు. ఎవరికీ మన మాతృభాష అక్కరలేదు.
21వ శతాబ్దం తొలి దశకం దాకా చందమామ మాస పత్రిక తన పిల్లల కథలతో జైత్రయాత్రను సాగించింది. చిన్నపిల్లల నుంచి 90 ఏళ్ల వారి దాకా చందమామ అంటే ఎంతో మక్కువ. ప్రపంచీకరణ ధర్మమా అని చందమామ మాసపత్రిక కనుమరుగైపోయింది. ఇలాంటి సమయంలో ఈ పుస్తకం వచ్చింది.
మాండలికంలో పుస్తకాలు వస్తే ఒక ఉపయోగం ఉంది. ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉండే పదాలు తెలుస్తాయి. అలాగని, మాండలికం వాడి కథనాన్ని మరీ సంక్లిష్టంగా నడిపితే, చదివేవాళ్లు కూడా చదవకుండాపోయే ప్రమాదమూ ఉంది. ఈ పుస్తకం నిజానికి హోసూరు ప్రాంతపు మాండలికంలోని కథల సంకలనం. ఐతే, నేడు తెలుగు ప్రాంతాలు కాని ప్రాంతాల్లో రచయితలు స్వయంగా వెళ్లి, అక్కడి వారికి తెలుగు నేర్పించినవారు. ఆయా సమయాల్లో అక్కడ వాడుకలో ఉన్న కథలను సేకరించారు. సాధ్యమైనంతవరకు యాసను తొలగించి, తొలిసారిగా 2012లో ప్రచురితమైంది. నేటి వ్యవహారిక భాషలోకి మార్చి తిరిగి ప్రచురింపజేశారు. అదే ఈ హోసూరు కతలు-జతగాళ్లు, కతగాళ్లు అనే కథా సంకలనం. ఇందులో 21 కథలున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆయా ప్రాంతపు పేర్లు ఈ పుస్తకంలో జొప్పించక తప్పలేదనిపిస్తోంది. కథలన్నీ ఇద్దరు మిత్రుల సంభాషణల మధ్యనే సాగుతుంది. ఐతే ఇందులో ఉన్న కథలన్నీ లోకప్రియమైనవే. పుస్తకం చదవడానికి చేతులోకి తీసుకోగానే, కొంత నిరాసక్తత ఉన్నా రెండో కథనుంచీ ఆసక్తికరంగానే చదివేస్తాం. పెద్దవాళ్లైతే, పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటారు.
బడికెళ్లే పిల్లలకు, ముఖ్యంగా 4,5 తరగతుల పిల్లలకూ, ఇపుడిపుడే తెలుగు నేర్చుకుంటున్నవారికీ బహుమతిగా ఇవ్వడానికి ఈ పుస్తకం బాగా పనికివస్తుంది. దీని వెల కూడా తక్కువే. అచ్చుతప్పులూ దాదాపుగా లేవనే చెప్పాలి. ఈ పుస్తకాన్ని మరింత ఆకర్షణీయంగా ముద్రించి ఉండవచ్చేమోననిపిస్తున్నది. ఎందుకంటే, పిల్లలకు ఇలాంటి పుస్తకాలను రంగుల్లో, ఆకర్షణీయంగా అందించాలి. అపుడే రచయితల లక్ష్యం కూడా నెరవేరుతుంది. ప్రచురణకర్తలు ఆంగ్ల భాషలో చిన్నపిల్లల పుస్తకాలు- ముఖ్యంగా నిద్రించే సమయపు కథలు (బెడ్‌టైం స్టోరీస్) పుస్తకాలను ఒక్కసారి చూస్తే మంచిది. ఏదేమైనా మంచి పుస్తకం ద్వారా వెలువడ్డ మరో మంచి పుస్తకం యిది.

-వివివి.రమణ