అక్షర

‘వర్ణ-ఆశ్రమ’ ధర్మనిర్వహణయే ‘కర్మ’యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివేణీ సంగమం
(్భక్తి, కర్మ,
జ్ఞానయోగ విచారణ)
-పింగళి పాండురంగారావు
ద్వితీయ వేణిక
- కర్మయోగదర్శ
-స్వామి వివేకానంద
153వ జయంతి
ప్రత్యేక ప్రచురణ
**
భగవద్గీతలోని మొత్తం 18 అధ్యాయాలలో మొదటి ఆరు అధ్యాయాల్లో కర్మను గురించిన ప్రస్తావన ప్రధానం కావడంతో వీటిని ‘కర్మషల్కుం’ అన్నారు. ఏడునుండి పనె్నండో అధ్యాయం వరకు ఆరు అధ్యాయాలు భక్తి విషయాన్ని వివరిస్తారు. 13 నుండి 18 వరకు ఆరు అధ్యాయాలలో మానవుని దైనందిన జీవితంలో కనిపించే ప్రవర్తన విశేషాలు వివరించబడినాయి.
మానవుడు తన నిత్యకృత్యాలను వర్ణ, ఆశ్రమ ధర్మాలకు అనుగుణంగా గానీ తన స్వభావానికి అనుగుణమైన సత్కర్మ ఆచారం ద్వారాగానీ నిష్కామ బుద్ధితో ఆచరించి, యోగసిద్ధిని పొంది, స్థిరచిత్తంతో చివరకు మోక్షకాంక్షను కూడా విడచి- తాను పరమాత్మ చేతిలోని పనిముట్టును మాత్రమే అని భావిస్తే తాను చేయాలనుకున్న పనులు చేయడమే మానవ జీవిత పరమలక్ష్యం. ఇదే కర్మయోగం- అని కృష్ణ్భగవానుడు భగవద్గీతలో బోధించాడు.
మనిషి తన వర్ణ, ఆశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించడము కర్మయోగం. కర్మతో జ్ఞానాన్ని అందుకొనే మార్గమే కర్మయోగము. ఈశ్వర ప్రేమమే భక్తియోగం. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కర్మమార్గాన్ని ముఖ్యమార్గమని భగవద్గీత బోధిస్తున్నది.
త్రివేణీ సంగమం (్భక్తి, కర్మ, జ్ఞానయోగ విచారణ)
ద్వితీయ వేణిక - కర్మయోగ ధర్మం- రచయిత పింగళి పాండురంగారావుగారు. ఈ గ్రంథంలో 15 అంశాలు వివరించారు. 1) కర్మయోగ దర్శం 2) స్వామి వివేకానంద కర్మయోగం 3) కర్మ, జ్ఞాన, భక్తి తత్వములు 4) భక్తివేదాంతస్వామిభావాలు 5) నిర్వికల్పానందస్వామి అభిప్రాయాలు 6) వేదాల అంతరార్ధం 7) భాగవతంలో జ్ఞాన.. 8) అచ్యుతానందగిరి ప్రవచనాలు 9) భాగవతంలో ... బ్రహ్మోపదేశం 10) సద్గురు శివానందమూర్తిగారి అమూల్య అభిప్రాయం. 11) ఆధ్యాత్మిక శాస్తవ్రేత్త వి.ఎస్.ఆర్.మూర్తిగారి రచన శిల్పం 12) ఆచార్య ఐ.వి.చలపతిరావుగారు తెలిపిన విలువైన విషయాలు 13) భాగవతంలో శ్రీకృష్ణుడు వినిపించిన శృతిగీతాలు 14) ఆధ్యాత్మిక శాస్తవ్రేత్త అరవిందరావుగారి భావనలు 15) ఇంగ్లీషులో భక్తి, జ్ఞాన, కర్మయోగపై ప్రొఫెసర్ ఎలెన్ వివరణ.
ఇవన్నీ ఎంతో విలువైనవే అని చెప్పడంలో సందేహం లేదు. కాని కొన్ని మాటలు మనకేమీ అర్థంకానట్లుగానే ఉండడంవల్ల వాటిని గురించిన వివరాలు ఇస్తే బాగుండేది కదా అనిపిస్తుంది.
ఉదాహరణకు పేజి తిలో కర్మను గురించి కొద్దిగా తెలుసుకుందాం అంటారు.
‘పరబ్రహ్మ’లో నుండి ‘బ్రహ్మ’పుత్రుడు. ‘కర్మ’బ్రహ్మలో నుంచి పుడుతుంది. సర్వగతుడైన బ్రహ్మ ‘యజ్ఞం’లో నిత్యప్రతిష్ఠలపై ఉంటాడు.
- అంటే సామాన్య పాఠకుడికి ఏమైనా అర్థం అవుతుందా!
అర్థం అయినట్టు అతడు కేవలం తల ఊపడం తప్ప ఏదీ చేయలేడుకదా!- ఏ రచనయైనా సామాన్యుడికి అర్థంఅయేట్లు తయారు అయితేనే దానికి ప్రయోజనం లభిస్తుంది. లేకుంటే వ్యర్థమేకదా!

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి