అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహామహిమాన్విత
ఆపద్బాంధవులు
జగద్గురు గౌసులాజం దస్తగీర్
1వ, 2వ సంపుటాలు
-హజరత్ ఖ్వాజా
డాక్టర్ నూర్ అహమద్ షాహ్
రెండు సంపుటముల
వెల: రూ.580/-
ప్రతులకు: ఛైర్మన్, డా.షానూర్ బాబా ఆస్తానా (సంస్థానము) ట్రస్టు
కేంద్ర శాఖ: చేపల కాలనీ వద్ద, కణేకల్లు క్రాస్‌రోడ్
కణేకల్లు - 515871,
అనంతపురం జిల్లా.
9701964955
**
సర్వాంగ సంపూర్ణమైన, రెండు సంపుటములలోనున్న ఇస్లాములోన వహబీల అతివాద మరియు ఆధ్యాత్మిక సూఫీ తత్వముల మధ్యగల వ్యతిరేక భావనల అధ్యయనము ‘వహీబీల ఉగ్రవాదమా లేక సూఫీ సద్గురువుల శాంతి పథమా’ అను పేరుతో ఆధ్యాత్మిక గురువు డా.హెచ్.నూర్ అహ్మద్ షాచే సృజించబడిన అధ్యయనము సర్వేశ్వరుడు (అల్లాహ్ మహాప్రభువు) పైని మరియు మానవాళిపైనున్న ప్రేమతో స్పష్టముగా ప్రేరేపితమై యున్నది.
ఈ కృతి నిస్సందేహముగా ఇస్లాము మేధోసంపద యొక్క సర్వ సంగ్రహ నిఘంటువుగా కీర్తిమంతులైన ప్రముఖ సద్గురువుల పలువురి జీవిత చరిత్రలను పొందుపరుస్తూ మరియు అనేక సూఫీల భవనముల అనేక చిత్తరువులు కలిగి వున్నది. రచయిత డా.నూర్ అహ్మద్, స్వయానా ఖాదరీయ, చిప్తీ నిజామీ, బిందా నవాజీ, షుత్తారీ, సుహరివర్దీ పరంపరలకు చెందిన సూఫీ తత్వవేత్త. సూఫీ తత్వము, వహాబీ తత్వాన్ని (దక్షిణ ఆసియాలోని దాని ప్రతిరూపాలైన తాలిబాన్‌లను ప్రేరేపించిన దేవబందీ (తబ్లీగు జమాత్) తత్వము, వౌదూదీ స్థాపించిన అతివాద జమాతే ఇస్లాములను) వివరిస్తూ, ఇంకా చాలా విషయాలను ప్రస్తావించారు. వీటిలో హిందూ, బౌద్ధ, ఇస్లాము మతముల (వేదాంత) తత్వ విచారములు, సూఫీ తత్వ మరియు సుప్రసిద్ధ సూఫీల ఉపదేశములు సమ్మిళితములై వున్నవి.