అక్షర

వచనంలో భాగవతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్భాగవత మహాపురాణము (తెలుగు వచనము)
- యం.వి.నరసింహారెడ్డి
వెల: రూ.350/-
ప్రతులకు: కౌసల్య
తెలుగు పండిట్ శిక్షణా
కళాశాల.. జగిత్యాల- 505327
(కరీంనగర్ జిల్లా) మరియు
గోపాల్‌బుక్ హౌజ్, కాచిగూడ క్రాస్‌రోడ్స్- హైదరాబాదు

మరణాసన్నవ్యక్తి చేయవలసిన కార్యమేమిటి, ఏమి శ్రవణం చేయాలి, ఎవరిని జపించాలి, ఎవరిని స్మరించాలి, భజించాలి అనే సందేహాన్ని పరీక్షిత్తు వెలిబుచ్చగా ధర్మజ్ఞుడైన శుకుడు చేసిన జ్ఞానోపదేశమే మహాభాగవతం. కల్పవృక్షము నుండి పక్వమైన పండు వంటి భాగవతాన్ని గింజలు, పెచ్చులు కూడా లేని రీతిలో ఒలిచి చేతిలో పెట్టినట్లు శ్రీమద్భాగవత మహాపురాణాన్ని యం.వి.నరసింహారెడ్డిగారు తెలుగులో వచన రూపంలో రచించారు. ఇందులో పనె్నండు స్కంధాలున్నాయి. భాగవతానికి భూమిక ఏర్పడిన విధం ప్రథమ స్కంధంలో వుండగా సృష్టి రచన, భగవంతుని అవతార వర్ణనలు ద్వితీయ స్కంధంలో వున్నాయి. ఉద్ధవుడు శ్రీకృష్ణుని లీలలను తెలిపి మరింత జ్ఞాన సముపార్జనకోసం మైత్రియుణ్ణి దర్శించమనగా విదురుడు దర్శించుకోవడం, జయవిజయులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ, కపిలుని జననం మొదలైనవి వివరించబడిన స్కంధం తృతీయ స్కంధం. సతీదేవి దేహత్యాగం, దక్షయజ్ఞ ధ్వంసం, బోళాశంకరుడు ప్రసన్నుడు కావడం, ధృవోపాఖ్యానము, పురంజనుని కథ చతుర్థాశ్వాసంలో వున్నాయి. పంచమ స్కంధంలో అంత్యకాలంలో జింకనే స్మరిస్తూ దేహత్యాగం చేసిన భరతుడు మరుజన్మలో జింకగా పుట్టిన కథ వుంది, షష్ఠమ స్కంధంలో పుత్రప్రేమకు వశుడైన అజామిలుని కథ, వృత్తాసురవధ వున్నాయి, సప్తమ స్కంధంలో నరసింహావతారం వున్నాయి. అష్టమ స్కంధం భాగవతానికి ప్రాణం వంటిది. గజేంద్రమోక్షం, సముద్ర మథనం, మత్స్యావతారం, వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించడం, వామనావతారకథ వున్నాయి. పరమాత్మ చింతనలో లీనంకమ్మని శుకుడు ఉపదేశించడంతో పరీక్షిత్తు పరమగతిని పొందాడు. కర్మఫలాన్ని అనుసరించి సుఖదుఃఖాలుంటాయని, సర్పయాగాన్ని విరమించుకోమని బృహస్పతి చెప్పగా జనమేజయుడు విరమించుకోవడం, ద్వాదశ స్కంధంలో కనిపిస్తుంది, పోతన భాగవతంలోని కొన్ని ప్రసిద్ధమైన పద్యాలను పుస్తకం చివరలో చేర్చారు, రచయిత అవసరమనిపించినచోట్ల వ్యాఖ్యానాలు చేశారు. గోపికా వస్త్రాపహరణానికి సంబంధించి సంశయ నివృత్తిగా వివరణనిచ్చారు. గోపికాకృష్ణులను సాధారణ మానవుల్లా ఊహించడం తగదని, పరమేశ్వరుడు, సూర్యుడు, అగ్నిదేవుడు మొదలైన వారితో మానవులు పోల్చుకోవడం తగదని, అటువంటివారి లీలలన్నీ దివ్యమైనవనీ, లౌకికమైనవి కావని సుదీర్ఘంగా వ్యాఖ్యానించారు. తెలిసీ తెలియక విమర్శలు చేసేవారికి ఇవి సమాధానాలుగా వున్నాయి. అలాగే దక్షయజ్ఞాన్ని శంకరుడు ధ్వంసం చేయడానికిగల కారణాలను కూడా వివరంగా ఇచ్చారు.

-కె.లక్ష్మీ అన్నపూర్ణ