అక్షర

భక్తులకు రుచించే లలితా నామామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ లలితా నామామృతము
(నామార్థవివరణ)
- పులిపాక శ్రీదేవి
వెల: రూ.200/-
ప్రతులకు: రచయత్రి,
ఫోన్ నెం.9908415124

భక్తికి అమ్మవారి తత్త్వాన్ని ఆబాలగోపాలానికి అందించాలన్న తపనతోడై, గురువుల బోధ ద్వారా ప్రభావితమై, మంత్రోపదేశాన్ని పొంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రం కావాలన్న లక్ష్యంతో చేస్తున్న సాధనలో భాగంగా శ్రీ లలితానామామృతం (నామార్థ వివరణ)ను పులిపాక శ్రీదేవిరచించారు. శ్రీ లలితా సహస్ర నామాలలోని శ్లోకాలలోనుండి విడివిడిగా ఒక్కొక్క పాదానికి, కొన్నిచోట్ల సందర్భాన్ని అనుసరించి రెండు పాదాలకు కలిపి వివరణను ఇచ్చారు. ఇలా మొత్తం 366 విషయాలను వివరించారు, అవసరమైనచోట్ల దీర్ఘంగాను, లేనిచోట్ల క్లుప్తంగాను వున్నాయి. ఇవన్నీ అమ్మవారి రూపానికి సంబంధించినవి. లీలామాహాత్మ్యాలకు సంబంధించినవి, అమ్మవారి ప్రతి ఒక్క నామం మహిమాన్వితమైనదే. ముల్లోకాలు, దేవతలు, మహర్షులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు అందరూ సేవిస్తూ వుండగా జగదాంబ వారిని ఉద్ధరించేందుకోసమై వశిన్యాది వాగ్ద్వేవతలను తన గురించి సహస్రనామ పారాయణము చేయవలసినదిగా ఆజ్ఞాపించింది. వారు వాక్కునకు అధిదేవతలు, అమ్మవారినుండి ఉద్భవించిన శక్తులే వారిని గురించి వివరించగలవు. అంటే అమ్మ మాత్రమే వివరించగలదు, ఇతరులకు సాధ్యంకాదు, రహస్య సహస్రనామాలు హయగ్రీవుడు ఉపదేశించగా, హయగ్రీవుని ద్వారా అగస్త్యునికి తద్వారా జగత్తుకు అందించబడినాయి. శచీదేవి భువనేశ్వరీదేవిని ఉపాసించడం ద్వారా తన భర్త శాపవశాన పోగొట్టుకున్న ఇంద్ర పదవిని తిరిగి దక్కించగలిగింది. లలితా నామాలు బోధపడాలంటే శ్రీచక్రము, షడ్చక్రాలు వంటి విషయాలపై ప్రాథమిక అవగాహన వుండాలి. అప్పుడే దానిలోని తత్త్వం బోధపడుతుంది. అంతటా ఆవరించి వున్న ఆ శక్తియొక్క మూర్తిమత్వ రూపమే లలితాదేవి, అమ్మవారి పాదాలనుండి జనించిన కిరణ సముదాయాన్నుండి అగ్ని 108 కిరణాలు, సూర్యుడు 116, చంద్రుడు 136 కిరణాలను గ్రహించారు. పగటి సమయంలో సూర్యుని వెలుగుతో, రాత్రి సమయంలో చంద్రుని కాంతులతో, సంధ్యాసమయంలో అగ్నితేజస్సుతో అమ్మవైభవం నిండివున్నది. సూర్యుడు, చంద్రుడు ఆ తల్లికి రెండు కళ్ళు. అమ్మవారి ముక్కుపుడకకుగల విశేషాన్ని రచయిత్రి వివరించారు. సందర్భానికి అనుగుణంగా భగవద్గీతలోని అంశాలను, విషయాలను ఇతర పురాణాలలోని, గ్రంథాలలోని విషయాలను తెలుపుతూ సమగ్రంగా అందించారు. రామకృష్ణ పరమహంస, భగవాన్ శ్రీ రమణులు, వివేకానందులు మొదలైనవారి వ్యక్తిత్వము, సేవ వంటి విశేషాలను పేర్కొన్నారు. జడభరతుని కథ వుంది. ఏ నామానికి ఏ ఫలితాలు కలుగుతాయో అలా కొన్నింటి నామాలు చెప్పబడ్డాయి. వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లికా, తాటంకయుగళీభూత తపనోడుపమండలా... వంటి ఉదాహరణలు. శుద్ధ విద్యాంకురాకారం ధ్విజపంక్తిద్వయోజ్జ్వలా నామాన్ని వ్యాఖ్యానిస్తూ అమ్మవారి పలు వరుస వర్ణించారు, అది షోడశిమంత్ర బీజాక్షరాలుగా, బ్రాహ్మణులు రెండు వరుసలలో కూర్చుండి వేదాలు చదువుతున్నట్లుగాను భాసించినాయట. సౌందర్య లహరిలోని విపంచ్యా...., ధునోతుధ్వాంతం, భవానిత్వం..., అవిద్యానమంత శ్లోకాలతో సమన్వయిస్తూ చెప్పిన విధానంతో వ్యాఖ్య సముచితంగా వుంది. భండాసురవధను సవివరంగా తెలిపారు. సంపత్కరీ సమారూఢ వంటి నామాల విశేషాలు, యుద్ధవర్ణన, అమ్మవారు జయసిద్ధి పొందడం తెలిపారు. జీవియొక్క అజ్ఞానం తొలగి ఆత్మయే పరమాత్మ స్వరూపం అని తనకుతాను తెలుసుకోవడమే భండాసురవధ. అది తెలుసుకోవడమే మోక్షము. విషంగ విశుక్రులిద్దరూ జీవునిలోవున్న విషయ వాసనలకు ప్రతీకలు. వీటినుండి బయటపడినవారే పరమాత్మకు దగ్గరవుతారు అని వివరించారు. తమ హృదయంలోనే వున్న భగవంతుని ఉనికిని తెలుసుకునేందుకు కొద్దిపాటి సాధనకూడా చేయాలి అని తెలిపారు. విషయాలు చెప్పి వదిలివేయకుండా మనం కూడా ఆ తల్లి నామాలను పఠిద్దాం. ఆ తల్లిని స్మరించుకుందాం అంటూ చెప్పడం ద్వారా వ్యాఖ్యాత్రికిగల భక్త్భివం విశదమవుతున్నది.

-కె.లక్ష్మీఅన్నపూర్ణ